Home » National
పశ్చిమ ఉత్తప్రదేశ్‌లో వాతావరణ కాలుష్యం మంగళవారం పలుచోట్ల రోడ్డు ప్రమాదాలకు దారి తీసింది. దారి కానరాక కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు బైకర్లు అసువులు బాసారు. దీంతో, అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ప్రజలకు సూచనలు జారీ చేశారు.
ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ డేను 'సెలవు దినం'గా ప్రకటించింది. కొన్ని సర్వీసులు యథాప్రకారం పనిచేయనుండగా, మరికొన్ని సేవలు మూతపడతాయి.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందనే సీఎం సిద్ద రామయ్య(CM Siddaramaiah) ఆరోపణలకు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి(Union Minister Pralhad Joshi) తిప్పికొట్టారు. హుబ్బళ్ళిలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నింది సిద్దరామయ్య అన్నారు.
ముడా సైట్లు వాపసు ఇవ్వమని అప్పుడే చెప్పలేదా... నా మాట విని ఉంటే ఎంతో బాగుండేదని ఈ కేసుల వివాదం ఏంటంటూ సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah)తో కేంద్రమంత్రి సోమణ్ణ(Union Minister Somanna) ప్రస్తావించారు. సోమవారం రమణశ్రీ హోటల్లో జరిగిన అఖిల భారత శరణసాహిత్య పరిషత్ సభకు సీఎం వస్తుండగా అప్పుడే కేంద్రమంత్రి సోమణ్ణ బయటకు వచ్చారు.
సేలం జిల్లాలో ‘పేదల ఊటీ’గా పేరొందిన ఏర్కాడు(Erkadu) అంతటా మంచు కురుస్తుండటంతో పర్యాటక ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. కనివినీ ఎరుగని రీతిలో చలిగాలులు వీస్తుండటంతో స్థానికులు, పర్యాటకులు చలికి వణకిపోతున్నారు. వారం రోజులుగా ఏర్కాడు, పరిసర ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో డెల్టా, కోస్తాతీర జిల్లాల సహా పుదుచ్చేరి, కారైక్కాల్(Puducherry, Karaikal) ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వివాదాస్ప వ్యాఖ్యల కేసులో పుళల్ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న నటి కస్తూరి(Kasturi)కి తొలిరోజు కంటిపై కునుకే కరువైందని జైలు వర్గాలు తెలిపాయి. ఎగ్మోర్ మెట్రోపాలిటన్ కోర్టు(Egmore Metropolitan Court) 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను ఆదివారం మధ్యాహ్నం పుళల్ సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించిన అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్-20 నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 4700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మన రాకెట్లు తీసుకెళ్లేందుకు సాధ్యపడకపోవడంతో స్పేస్ ఎక్స్ ద్వారా ఇస్రో ప్రయోగించింది.
ఢిల్లీ కాలుష్యం తీవ్రంగా పరిణమించిన నేపథ్యంలో నాలుగో దశ కార్యాచరణ ప్రణాళిక(జీఆర్ఏపీ-4)ను సోమవారం ఉదయం నుంచి అమల్లోకి తెచ్చారు.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికాలోని కాలిఫోర్నియో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందింది.