Home » National
పోలింగ్ బూత్‌ల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకొని రాకూడదంటూ ఎన్నికల కమిషన్(ఈసీ) ఇచ్చిన ఆదేశాల్లో చట్టవ్యతిరేకత ఏమీ లేదని సోమవారం బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్సీపీ(ఎస్పీ) నేత అనిల్ దేశ్‌ముఖ్ కారుపై నాగ్‌పూర్ జిల్లాలో సోమవారం రాత్రి రాళ్ల దాడి జరిగింది.
ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన కైలాష్ గెహ్లోత్ సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రులు ఖట్టర్, హర్ష్ మల్హోత్రా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇటు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. దీనికి ప్రధాన కారణం కూడా ఉంది. మహారాష్ట్రలో ప్రధాన ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్సీపీలు గత రెండేళ్లలో అడ్డంగా చీలిపోవడం, చీలక పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా వేర్వేరు కూటమిల్లో తలపడతుండటం ఈ ఆసక్తిని పెంచుతోంది
జార్ఖాండ్‌లో ప్రధాన పోటీ అధికార జార్ఖాండ్ ముక్తి మోర్చా సారథ్యంలోని 'ఇండియా' కూటమికి, భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి మధ్య ఉంది. 'ఇండియా' కూటమిలో జార్ఖాండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి.
నాగాలాండ్ రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటిస్తున్నారు. నాగాలాండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అధికారులతో కలిసి బండి సంజయ్ సమీక్షించారు.
కాంగ్రెస్, జేఎంఎం నేతల ఇళ్లల్లో పెద్దఎత్తున నోట్లకట్టలు పట్టుబడ్డాయని, ఈ సొమ్మంతా కాంగ్రెస్‌దా, ఆర్జేడీ లేదా జేఎంఎందా అని ఆయన ప్రశ్నించారు. అందతా రాష్ట్రాభివృద్ధికి మోదీ పంపిన సొమ్మని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలన్నారు.
తాను ఎన్నో యుద్ధాలు చూశానని.. కానీ, ఇలాంటి యుద్ధం నేనెప్పుడూ చూడలేదంటూ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతుండంతో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితిని అమిత్‌షా సమీక్షించడంతో పాటు, ఎలాంటి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు.
నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. తన వాదనకు బలం చేకూర్చే రెండు పోస్టర్లను ఆయన ప్రదర్శించారు.