Amit Shah: మణిపూర్‌కు మరో 50 సీఆర్‌పీఎఫ్ కంపెనీలు.. అమిత్‌షా సమీక్ష
ABN , Publish Date - Nov 18 , 2024 | 05:43 PM
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతుండంతో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితిని అమిత్‌షా సమీక్షించడంతో పాటు, ఎలాంటి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఆర్‌పీఎఫ్, రాష్ట్ర పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు.
న్యూఢిల్లీ: మణిపూర్ (Manipur)లో మళ్లీ హింసాకాండ ప్రజ్వరిల్లడంతో అక్కడి పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) రెండో రోజైన సోమవారంనాడు కూడా అత్యున్నత స్థాయి భద్రతా సమావేశంలో సమీక్షిమించారు. ఈశాన్య రాష్ట్రంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతుండంతో రాష్ట్రంలో భద్రతను మరింత పటిష్టం చేయాలని హోం శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితిని అమిత్‌షా సమీక్షించడంతో పాటు, ఎలాంటి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఆర్‌పీఎఫ్, రాష్ట్ర పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు.
Rahul Gandhi: అదానీ ప్రయోజనాల కోసమే బీజేపీ 'ఏక్ హై తో సేఫ్ హై' నినాదం
అదనంగా 50 కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాలు
మణిపూర్‌కు అదనంగా 50 కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాలను పంపించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం 20 కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాలు రాష్ట్రంలో మోహరించగా, తాజా నిర్ణయంతో 70 కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాలు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతను తీసుకుంటాయి.
ఆరుగురి ఊచకోతతో..
గత ఏడాది మణిపూర్‌లో చెలరేగిన జాతుల ఘర్షణలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పాగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉన్న తరుణంలో గత శనివారంనాడు తిరిగి హింసాకాండ చెలరేగింది. సాయుధ మిలిటెంట్లు ఆరుగురు గ్రామస్థులను కిడ్నాప్ చేసి ఊచకోత కోసి చంపడంతో ఒక్కసారిగా ఆందోళనలు పెల్లుబికాయి. నిరసనకారులు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేసి, వాహనాలను తగులబెట్టారు. సీఎం బీరేంద్ర సింగ్ ఇంటిపై కూడా దాడికి విఫలయత్నం చేశారు. నిరసనలు, ఆందోళనలను అదుపు చేసే క్రమంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో జిరిబాం జిల్లాకు చెందిన 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆందోళనకారులు స్థానిక బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల్లోకి చొరబడి ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. ఫర్నిచర్‌ను దగ్ధం చేశారు. మణిపూర్‌లో సంక్షోభం ముదురుతుండటంతో శాంతిభద్రత వైఫల్యానికి నిరసగా బీజేపీ సారథ్యంలోని బీరేంద్ర సింగ్ ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) మద్దతును ఉపసంహరించుకుంది.
మూడు కేసుల దర్యాప్తు ఎన్ఐఏకు..
కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు ఇటీవల మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండకు సంబంధించిన మూడు కేసుల దర్యాప్తు బాధ్యతను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చేపట్టింది. వీటిలో కుకీ ఉగ్రవాదులకు, సీఆర్‌పీఎఫ్‌కు మధ్య ఇటీవల జరిగిన కాల్పులకు సంబంధించిన కేసు కూడా ఉంది. ఈ ఎన్‌కౌంటర్‌లో 11 మంది కుకీ ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి.
ఇవి కూడా చదవండి...
Swara Bhasker: స్వరభాస్కర్.. ఏంటిది? ముస్లిం మత పెద్దను కలిసిన బాలీవుడ్ నటిపై నెటిజన్ల ఆగ్రహం..
New Delhi: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. పెన్షన్ రూల్‌లో మార్పు..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..