Home » Politics
ఎయిర్‌పోర్టు రూట్లలో ఆర్టీసీ నడుపుతున్న ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులు లేక ఖాళీగా తిరుగుతున్నాయి.
తెల్లవారితే రాష్ట్రంలో ఓట్ల పండగ. ఇప్పటికే దేశంలో జరిగిన మూడు విడతల లోక్‌సభ ఎన్నికల్లో అంతంతమాత్రంగా ఓటింగ్ శాతం నమోదైంది. దీంతో నాలుగో విడత పోలింగ్‌ను సీరియ్‌సగా తీసుకున్న ఎన్నికల కమిషన్ ఎలాగైన ఓటింగ్‌ను పెంచాలని సంకల్పించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు (AP Elections) మరికొన్ని గంటలే సమయం ఉంది. ఈసారి ఓటు వేయాల్సిందేనని తెలుగోడు గట్టిగా ఫిక్సయ్యాడు!. అందుకే దేశ విదేశాల్లో ఉన్న పలువురు ఓటర్లు ఇండియాకు విచ్చేయగా.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు కూడా వచ్చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు (Telugu People) ఓటింగ్‌పై ఆసక్తిగా ఉన్నారు...
ఎన్నికలంటే సాధారణ విషయం కాదు. పార్టీలో టికెట్ దక్కించుకోవడం మొదలు,పోలింగ్ ముగిసే వరకు అభ్యర్థులు అనేక కష్టాలు పడాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల (AP Elections) ముందు కూడా అధికార వైసీపీకి (YSR Congress) షాకులు తప్పట్లేదు. ఇప్పటికే టికెట్లు దక్కని.. ఆశావహులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. ఎంపీలు రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వైసీపీకి మరో ఊహించని షాక్ తగిలింది..
పోలింగ్ తేదీ సమీపిస్తోంది.. ఇక మిగిలింది మూడు రోజులే.
వైసీపీ సీనియర్ ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) మరో సంచలనానికి దారితీశారు. ఖాళీగా కూర్చుంటే ఏం వస్తుంది..? ప్రచారానికి పోతే ఏంటి.. పోకపోతే ఏంటనుకున్నారో ఏమో కానీ మీడియా ముందు వాలిపోయారు. ఇక గొట్టాల ముందుకు వస్తే ముద్రగడ ఎలా మాట్లాడుతారో తెలుసు కదా. యథావిధిగా తన నోటికి పనిచెప్పారు. బాబోయ్.. ఆయన మాట్లాడుతుంటే అది నోరా.. తాటిమట్టా అన్నట్లుగా సొంత పార్టీ నేతలు, సామాజికవర్గ నేతలు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి..
ఈనెల 13న లోక్‌సభ పోలింగ్ ఉండడంతో అన్ని పార్టీలు ఓటర్ల వేటలో పడ్డాయి.
ఎన్నికల నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వేసవి టూర్ గేర్లను మార్చుతున్నారు.
పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.