Home » Politics
ఎన్నికల నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వేసవి టూర్ గేర్లను మార్చుతున్నారు.
పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
మైలవరం (Mylavaram) నియోజకవర్గ తాగు, సాగునీటి సమస్యల పరిష్కారమే తన ప్రథమ ప్రాధాన్యమని మైలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇబ్రహీంపట్నం మండల తాగునీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తామన్నారు. 5 నెలల్లో చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్‌తో (Vasantha Krishna Prasad) ‘ఆంధ్రజ్యోతి’ ముఖాముఖి..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా (AP Elections) అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లాలోని గుడివాడ (Gudivada) ఒకటి. ప్రధాన పార్టీ అభ్యర్థులిద్దరూ ఆర్థిక, అంగబలాల్లో సమాన స్థాయిలో ఉండడంతో గుడివాడ పోరు ఆసక్తి రేపుతోంది. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్ నాని (Kodali Nani), టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా ఎన్నారై వెనిగండ్ల రాము (Venigandla Ramu) పోటీ చేస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్‌కు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో చివరి అస్త్రాలు ఏమున్నాయా అని బయటికి తీసే పనిలో అధికార, ప్రతిపక్షాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయడానికి ఉద్యోగులు కదం తొక్కుతున్నారు.
వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) కుమార్తె క్రాంతి భారతి మరో సంచలనానికి తెరదీశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని చెప్పడం.. ఆ తర్వాత పేరు కూడా మార్చుకుంటానని ముద్రగడ చేసిన ప్రకటనపై క్రాంతి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆమె కామెంట్స్‌కు స్పందించిన ‘కూతురు నా ప్రాపర్టీ కాదు’ అని చెప్పడం పెద్ద సంచలనమే అయ్యింది. తాజాగా..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. పట్టుమని పదిరోజులు కూడా పోలింగ్ లేకపోవడంతో.. ఇక చివరిగా అస్త్రాలు సంధించడానికి అధికార, ప్రతిపక్షాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీ గురించి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటికొచ్చింది. అదేమిటంటే..
హైదరాబాద్ మహా నగరంలో అత్యంత కీలకంగా ఉన్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో కుల సమీకరణలు మొదలయ్యాయి.
ముచ్చటగా మూడో పార్టీ రాజకీయాలు ఒంటబట్టినట్టేనా..? చేవేళ్లలో గెలిచారు.. ఓడారు.. ఈసారి విజయం సాధిస్తారా..? పార్టీ మారినా ప్రత్యర్థి మాత్రం మారలేదు.. బీజేపీ బలం కలిసొస్తుందా..? అర్బన్ ప్రజల అండ సరే.. గ్రామాల్లో ఎలా పాగా వేస్తారు..? ధనవంతుల బరి.. చేవెళ్లలో ప్రజలు ఎవరికి పట్టం కడతారు..? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, సంచలన విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం బిగ్ డిబేట్ చూసేయండి..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. పట్టుమని పదిరోజులు కూడా సమయం లేకపోవడంతో అభ్యర్థులు అస్త్రాలను బయటికి తీస్తున్నారు. అయితే.. అదేంటో కానీ మంత్రి రోజాపై మాత్రం సొంత పార్టీ నేతలే రివర్స్ అవుతున్నారు. అంటే.. రోజాపైనే సొంత మనుషులు రివర్స్ అస్త్రాలు వదులుతున్నారన్న మాట!