AP Elections: తగ్గేదేలే అంటున్న ముద్రగడ కుమార్తె.. మరో సంచలనం!!
ABN , Publish Date - May 04 , 2024 | 11:42 PM
వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) కుమార్తె క్రాంతి భారతి మరో సంచలనానికి తెరదీశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని చెప్పడం.. ఆ తర్వాత పేరు కూడా మార్చుకుంటానని ముద్రగడ చేసిన ప్రకటనపై క్రాంతి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆమె కామెంట్స్‌కు స్పందించిన ‘కూతురు నా ప్రాపర్టీ కాదు’ అని చెప్పడం పెద్ద సంచలనమే అయ్యింది. తాజాగా..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్‌కు తక్కువ సమయం ఉండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలు బయటికి తీస్తున్నాయి. ఇదిలా ఉంటే.. వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) కుమార్తె క్రాంతి భారతి మరో సంచలనానికి తెరదీశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని చెప్పడం.. ఆ తర్వాత పేరు కూడా మార్చుకుంటానని ముద్రగడ చేసిన ప్రకటనపై క్రాంతి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆమె కామెంట్స్‌కు స్పందించిన ‘కూతురు నా ప్రాపర్టీ కాదు’ అని చెప్పడం పెద్ద సంచలనమే అయ్యింది. తాజాగా.. మరోసారి క్రాంతి మాట్లాడారు. అటు తండ్రి.. ఇటు కుమార్తె ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా పరిస్థితి ఉంది. మొత్తానికి చూస్తే.. కాపు ఓట్లే ప్రధాన లక్ష్యంగా పిఠాపురంలో రాజకీయం నడుస్తోందని చెప్పుకోవచ్చు.
మన అదృష్టం!
‘పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రతి ఒక్కరం శ్రమిద్దాం. ఆయన విజయం కోసం నా వంతు కర్తవ్యం నిర్వహిస్తాను. పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు. ఆయన పిఠాపురం నుంచి పోటీ చేయడం మన అదృష్టం. సొంత డబ్బుతో పార్టీని నడుపుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్’ అని క్రాంతి చెప్పుకొచ్చారు. తన తండ్రి మాట్లాడిన తర్వాత భారతి ఇలా రెస్పాండ్ అవ్వడంతో.. ముద్రగడకు కౌంటర్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. చూశారుగా.. క్రాంతి స్పందించడం.. ముద్రగడ కౌంటర్ ఇవ్వడం.. మళ్లీ కుమార్తె స్పందించి తగ్గేదేలే పవన్ గెలుపు కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తానని చెప్పడంతో వైసీపీకి అస్సలు రుచించడం లేదు. మరోవైపు క్రాంతి చేస్తున్న వరుస ప్రకటనలతో జనసేన, టీడీపీ, బీజేపీలో ఫుల్ జోష్ వచ్చిటనట్లయ్యింది. దీన్ని బట్టి చూస్తే.. రేపో, మాపో ఆమె పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..!
ఇదివరకు ఎవరేమన్నారు..?
ఇప్పటి వరకూ ముద్రగడ.. క్రాంతి ఏమన్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం. "పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత విజయం కోసం తన తండ్రి పనిచేయొచ్చు, కష్ట పడొచ్చు తప్పు లేదు. జగన్ మెప్పు కోసం పవన్ కల్యాణ్ మీద మాట్లాడుతున్న భాష మాత్రం సరికాదు. పవన్ కల్యాణ్, ఆయన అభిమానులను కించపరిచేలా మాట్లాడటం తగదు. ముద్రగడ తీరు మార్చుకోవాలి. పవన్ కల్యాణ్‌ను తిట్టడం వల్ల ఒరిగేదేమి లేదు. ఎన్నికల సమయంలో ముద్రగడను సీఎం జగన్ వాడుతున్నారు. ఆ తర్వాత ముద్రగడ ఎటు కాకుండా పోవడం ఖాయం. ఈ విషయం ముద్రగడ తెలుసుకుంటే మంచిది. పవన్ కల్యాణ్ గెలుపు కోసం తన వంతుగా కృషి చేస్తా’’ అని క్రాంతి భారతి అన్నారు.
ఇందుకు ముద్రగడ స్పందిస్తూ.. ‘నా కూతురి వ్యాఖ్యలకు భయపడను. నా కూతురు నా ప్రాపర్టీ కాదు. నా కూతురికి పెళ్లి అవ్వకముందు నా ప్రాపర్టీ.. పెళ్లి అయ్యాక అత్తగారి ప్రాపర్టీ. నా కూతురు చేత వీడియో రిలీజ్ చేయించారు. ఎవరు బెదిరించినా బెదిరిపోను జగన్‌కి సేవకుడిగా ఉంటాను. నా కూతురికి నాకు మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. బెదిరిపోను. ఇదే పరిస్థితి రేపు పెండెం దొరబాబుకి రావచ్చు’ అని కుమార్తె వ్యాఖ్యలకు ముద్రగడ పద్మనాభం ఒకింత కౌంటర్ ఇచ్చారు.