Home » 2024
వ్యవసాయ, అనుబంధ శాఖల్లో రైతు సేవా కేంద్రాల సిబ్బంది క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వైసీపీ హయాంలో రైతు భరోసా కేంద్రం సిబ్బంది నియామకం అస్తవ్యస్తంగా సాగింది. ఆర్బీకే సిబ్బంది విధులు నిర్వర్తించేది ఒక శాఖలో.. నియంత్రణ మరో శాఖలో ఉండంతో గందరగోళం కొనసాగుతోంది. ఆర్బీకే సిబ్బంది వేతనం, సెలవుల మంజూరు బాధ్యతలను పంచాయతీ సెక్రటరీలకు అప్పగించారు. పనులు మాత్రం వ్యవసాయ, ఉద్యాన, సిరికల్చర్ శాఖల్లో ...
ఒడిశా నుంచి అనంతపురానికి అక్రమంగా గంజాయిని తరలించి, విక్రయించేందుకు సిద్ధమైన 11 మంది సభ్యుల ముఠాను అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సంఘమిత్ర కాలనీ సమీపంలోని ప్రైవేట్ ఫ్లాట్స్‌లో ఉండగా పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీస్ కాన్ఫరెన్స హాల్లో అదనపు ఎస్పీ రమణమూర్తి ఈ ముఠా వివరాలను తెలిపారు. అరెస్టు చేసిన ముఠా సభ్యులను మీడియాకు చూపించారు. ..
ప్రాణాపాయ స్థితిలో ఉండేవారిని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తున్న 108తోపాటు.. గ్రామీణ ప్రజల వద్దకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న 104 సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు నెలల నుంచి వీరికి వేతనాలు అందడం లేదు. వచ్చేది తక్కువ వేతనం. అదీ నెలనెలా అందడం లేదు. తాజాగా నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో సంస్థ తప్పుకోవడంతో బకాయి వేతనాలు వస్తాయో ...
‘తాంబూలం ఇచ్చాం.. తన్నుకు చావండి’ అన్నట్లుగా తయారైంది ‘అపార్’ వ్యవహారం. విద్యార్థులకు అపార్ ఐడీ క్రియేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అన్ని పాఠశాలల్లో ఆ ప్రక్రియను ప్రారంభించారు. దీనికోసం విద్యార్థుల జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్, తల్లిదండ్రుల ఆధార్ తీసుకురమ్మంటున్నారు. అన్నింట్లో వివరాలు ఒకేలా ఉండాలని చెబుతున్నారు. ఏ కొద్దిమందివో తప్ప.. సర్టిఫికెట్లు, ఆధార్లు ఏకరూపంగా లేవు. చిన్న చిన్న తేడాలున్నా సరిచేసుకుని ...
విద్యారంగ సమస్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి... విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ డి మాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వ ర్యంలో విద్యార్థులు బుధవారం చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు నగరంలో భిక్షాటన చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు.
విద్యాశాఖ ఇచ్చిన షెడ్యూల్ మేరకు మున్సిపల్ టీచర్ల పదోన్నతులు చేపట్టాలని ఎస్టీయూ నా యకులు డిమాండ్ చేశారు. ఆ సంఘం నాయకులు బుధవారం డీఈఓ ప్రసాద్‌బాబును ఆయన చాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు మాట్లా డుతూ... మున్సిపల్, నగర పాలక ఉపాధ్యాయుల పదోన్నతులు షెడ్యూల్ మేరకు చేపట్టాలన్నారు.
క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు పడుతూ వైద్య పథకాలు, సేవలు అందిస్తున్న ఏఎనఎంలకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో మరింత కష్టమవుతోందని ఏఎనఎంలు కలెక్టరు వద్ద వాపోయారు. ఏఎనఎంలు, ఆశా కార్యకర్తలు బుధవారం ఏఐ టీయూసీ నాయకులు రాజారెడ్డి, రాజేష్‌గౌడు తదితరులతో కలిసి కలెక్టరు వినోద్‌కుమార్‌ను కలెక్టరేట్లో కలిశారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించడానికి ఏర్పాటుచేసిన ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాలు కరువ య్యా యి. అద్దెభవనాల్లో సరైన సౌకర్యాలు లేక ప్రజలు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల పాత భవనాల్లో, మరికొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఓ మూ లన ఉన్న గదుల్లో ఉప కేంద్రాలను నిర్వహిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విలేజ్ క్లినిక్ పేరుతో పలు కొత్త భవనాలను మంజూరు చేసినా, వాటి నిర్మాణం అసంపూర్తిగానే నిలిచిపోయింది.
హోరాహోరీగా ప్రచారం కొనసాగిన 47వ అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం తుది అంకానికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా వేర్వేరు కాలమానాల ప్రకారం.. ఆయా రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచి పోలింగ్ ప్రారంభమైంది.
సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను కట్టడి చేయాలని పోలీసులకు హోం మంత్రి అనిత సూచించారు. గంజాయి మత్తులో, రాజకీయ ముసుగులో ఎంతో మంది నేరాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. పోలీసుల ప్రతిష్టను పెంచేలా బాధ్యతగా నడుచుకోవాలని శిక్షణ పూర్తి చేసుకున్న 12 మంది డీఎస్పీలకు సూచించారు. నగరంలోని పోలీసు శిక్షణా కళాశాలలో డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్‌ను ...