Share News

MLA : వైసీపీలో గుబులు పుట్టించిన యువగళం

ABN , Publish Date - Jan 29 , 2025 | 12:29 AM

సరిగ్గా రెండేళ్ల క్రితం నారా లో కేశ చేపట్టిన యువగళం పాదయాత్ర వైసీపీ నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందని ఎమ్మెల్యే పరిటా ల సునీత పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం అనంతపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నారాలోకేశ యువగళం పాదయాత్ర ఆరంభించి న రోజే వైసీపీ పతనం మొదలైందన్నారు.

MLA :  వైసీపీలో గుబులు పుట్టించిన యువగళం
Speaking MLA Paritala Sunitha

ఎమ్మెల్యే పరిటాల సునీత

అనంతపురం అర్బన, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): సరిగ్గా రెండేళ్ల క్రితం నారా లో కేశ చేపట్టిన యువగళం పాదయాత్ర వైసీపీ నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందని ఎమ్మెల్యే పరిటా ల సునీత పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం అనంతపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నారాలోకేశ యువగళం పాదయాత్ర ఆరంభించి న రోజే వైసీపీ పతనం మొదలైందన్నారు. అంత టా భయం.. ఆందోళన కమ్ముకున్న సమయంలో యువగళం పాదయాత్ర అందరిలోనూ ధైర్యం నింపిందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, అప్పటి వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులు సృష్టించినా జనమే బలమై, తన పాదయాత్రను నారా లోకేశ జైత్ర యాత్ర గా సాగించారన్నారు. రాప్తాడు, ధర్మవరం నియోజ కవర్గాల్లో గత ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలను, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుల అక్రమాలపై గళమెత్తారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మా ర్పులు చేపట్టి, రాష్ర్టాన్ని ఐటీ హబ్‌గా మార్చేం దుకు అన్ని విధాలుగా లోకేశ కృషి చేస్తున్నార న్నారు. అలాగే సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేశ పడుతున్న తపన చూస్తుంటే ఆంధ్రప్రదేశ రాష్ట్ర బంగారు భవిష్యత కళ్ల ముందే కనిపిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 29 , 2025 | 12:30 AM