Share News

MLA : అభివృద్ధే ధ్యేయంగా పాలన : ఎమ్మెల్యే శ్రావణీశ్రీ

ABN , Publish Date - Jan 29 , 2025 | 12:33 AM

గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధే ధ్యేయంగా టీడీపీ కూటమి పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే బండా రు శ్రావణీశ్రీ పేర్కొ న్నారు. ప్రజా పాలన అందిస్తూ చరిత్రలో నిలిచిపోయే విధంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మండల పరిధిలోని సిద్దరాంపురం పంచాయతీలోని ఎ. కొండాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఆమె సోమవారం ప్రారం భించారు.

MLA : అభివృద్ధే ధ్యేయంగా పాలన : ఎమ్మెల్యే శ్రావణీశ్రీ
A. MLA starting CC roads in Kondapuram village

బుక్కరాయసముద్రం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధే ధ్యేయంగా టీడీపీ కూటమి పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే బండా రు శ్రావణీశ్రీ పేర్కొ న్నారు. ప్రజా పాలన అందిస్తూ చరిత్రలో నిలిచిపోయే విధంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మండల పరిధిలోని సిద్దరాంపురం పంచాయతీలోని ఎ. కొండాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఆమె సోమవారం ప్రారం భించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజల ఆకాం క్షలకు అనుగుణంగా ఐదేళ్ల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంద న్నారు. రానున్న రోజుల్లో మరింత రెట్టించిన ఉత్సాహంతో చర్యలు తీసు కుంటామన్నారు. గడిచిన వైసీపీ పాలనలో అవినీతి వల్ల రాష్ట్రం ఆ ర్థికంగా చితికిపోయిందన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ డీఈ అరుణ కుమార్‌, జేఈ మద్దిలేటి, ఎంపీడీఓ సాల్మనరాజ్‌, తహసీల్దార్‌ పుణ్య వతి, టీడీపీ మం డల కన్వీనర్‌ అశోక్‌, నాయకులు పసుపుల శ్రీరామ రెడ్డి, హనుమంతరెడ్డి, ఎంపీపీ సునీత, టీడీపీ నేతలు పొడరాళ్ల రవీంద్రా, కేశన్న, లక్ష్మీనారాయణ, జొన్నారామయ్య, ఓబులపతి, పెద్దప్ప, రాము తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 29 , 2025 | 12:33 AM

News Hub