Home » ABN Andhrajyothy Effect
త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది పనుల్లో వేగం పెంచారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తూనే, మరోవైపు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు.
ప్రముఖ క్రికెట్ కోచ్, హైదరాబాద్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ బేగ్ సార్ ఇక లేరు. 84 ఏళ్ల బేగ్ సార్ ఛాతీ నొప్పితో గత రాత్రి తుది శ్వాస విడిచారు.
నేడు జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. గాంధీకి నివాళులర్పించేందుకు ఉదయం 7.30 గంటలకు ప్రధాని రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు.
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో 10వ గోల్డ్ మెడల్ చేరింది. పురుషుల టీమ్ స్క్వాష్ విభాగం ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది.
ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో దారుణం జరిగింది. శుక్రవారం ఎనిమిది నెలల గర్భిణి ఇంట్లో శవమై కనిపించింది. అత్తమామలు పొలం నుంచి ఇంటికి తిరిగొచ్చి చూసే సరికి రక్తంతో తడిసిన గర్భిణి మృతదేహం కనిపించింది.
ఆన్లైన్ షాపింగ్ ప్రియులకు వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ త్వరలో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. తాజాగా అమెజాన్ కూడా కస్టమర్లకు తీపి కబురు చెప్పింది.
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా షూటింగ్లో మనవాళ్లు అదరగొట్టారు. ఇప్పటివరకు భారత ఆటగాళ్లు 6 స్వర్ణ పతకాలు గెలిస్తే.. అందులో 4 స్వర్ణాలు షూటర్లే గెలిచారు.
జైపూర్ సాహిత్య ఉత్సవం(జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్)కు సంబంధించిన 17వ ఎడిషన్ షెడ్యూల్ విడుదలైంది. 2024 ఫిబ్రవరి 1 నుంచి 5 మధ్య రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో గల హోటల్ క్లార్క్స్ అమెర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.
భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు. 98 ఏళ్ల వయసున్న స్వామినాథన్ చెన్నైలోని ఆయన నివాసంలో ఈ రోజు తుది శ్వాస విడిచారు.
డ్రగ్స్ స్మగ్లింగ్, మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారుజామున చండీగఢ్‌లోని ఖైరా నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.