Home » ABN
తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వర్మతో జనసేన ( Janasena ) అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. నియోజకవర్గంలో ఎన్నికల వ్యూహాలపై ఇరువురు గంటపాటు చర్చించారు. నాలుగు రోజుల పవన్ పర్యటన షెడ్యూల్ పై మాట్లాడుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు అధికార నేతలపై విమర్శల అస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ లీడర్ బుద్దా వెంకన్న సీఎం జగన్ ( CM Jagan ) పై ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల తర్వాత వైసీపీకి తెలంగాణలో బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందని మండిపడ్డారు.
ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ మిస్టర్ కూల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ఎంఎస్ ధోనికి ఆటోమొబైల్స్పై ఎంత మక్కువ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు భారీ గ్యారేజీ కూడా ఉంది.
దేశ వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ( Elections 2024 ) రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అమలు చేస్తోంది.
లోక్సభ ఎన్నికలు - 2024కు సంబంధించిన మేనిఫెస్టోను కాంగ్రెస్ ( Congress ) ఏప్రిల్ 5 న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టో విడుదల అనంతరం దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించనుంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్న తరుణంలో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు వైసీపీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు సీఎం జగన్ ( CM Jagan ) వరస సభలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.
వైసీపీ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. కావలి, బనగానపల్లిలో నిర్వహించిన సభల్లో సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు హామీల వరద పారిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇస్తున్న హామీలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. శ
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ విజయం కోసం అభ్యర్థులు చిత్ర విచిత్రమైన పనులు అన్నీ చేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల ( Lok sabha Elections ) ప్రకటన వెలువడినప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతున్న తరుణంలో అగ్ర నేతలందరూ ప్రచారంలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో జనసేన ( Janasena ) అధినేత పవన్ కళ్యాణ్ పది నియోజకవర్గాలలో జరిగే ఎన్నికల ప్రచారం పాల్గొంటారు. ఈ మేరకు జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.