Share News

Election 2024: ఎన్నికల సమయంలో ఈ పనులు చేస్తే.. మీరు నేరం చేసినట్లే..

ABN , Publish Date - Mar 29 , 2024 | 09:44 PM

దేశ వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ( Elections 2024 ) రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అమలు చేస్తోంది.

Election 2024: ఎన్నికల సమయంలో ఈ పనులు చేస్తే.. మీరు నేరం చేసినట్లే..

దేశ వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ( Elections 2024 ) రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అమలు చేస్తోంది. నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఫలితాలు విడుదలయ్యేంత వరకు ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటుంది. ఈ సమయంలో నేరాల పరిధిలోకి వచ్చే కార్యకలాపాలు ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే తెలిసీ తెలియక చేసే పొరపాట్లు భారీ మూల్యం చెల్లించవచ్చు. కాబట్టి అనుక్షణం అప్రమత్తంగా ఉండటమే కాకుండా అలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.

Rahul Gandhi: కాంగ్రెస్ వస్తే మహిళలకు 50శాతం రిజర్వేషన్లు.. రాహుల్ సంచలన ప్రకటన

ఎన్నికల సమయంలో డబ్బు, మరేదైనా ప్రలోభ పెట్టి సాధారణ ప్రజలను ఓట్లు అడగడం తీవ్రమైన నేరం కిందకు వస్తుంది. బెదిరింపుల ద్వారా ఓట్లు అడగడం లేదా బలవంతంగా ఓట్లు వేయించడం కూడా ఎన్నికల కమిషన్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుంది. ఈ నేరాలకు పాల్పడిన వ్యక్తికి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఓటరును లేదా అభ్యర్థిని గాయపరుస్తామని లేదా చంపుతామని బెదిరిస్తే అది చాలా తీవ్రమైన నేరం. ఐపీసీ 171 ప్రకారం బెదిరించిన వ్యక్తికి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా విధించే నిబంధన ఉంది.

Elections 2024: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు.. ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు అందాయంటే..


ఎన్నికల ప్రచారంలో మద్యం పంపిణీ చేయడం లేదా ఓట్లకు ఆశపడి డబ్బుతో ప్రజలను ఆకర్షించడం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన అవుతుంది. ఇది చాలా తీవ్రమైన నేరాల విభాగంలోకి వస్తుంది. ఈ నేరానికి, సెక్షన్ 171B/171E కింద వ్యక్తికి కనీసం 3 నెలల జైలు శిక్ష పడుతుంది. ఓటింగ్ రోజున పోలింగ్ బూత్‌కు 100 మీటర్ల దూరంలో ఉండి ఏ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయమని ఓటరును బలవంతం చేయకూడదు. ఇలా చేస్తే సదరు వ్యక్తికి తీవ్రమైన శిక్ష పడొచ్చు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 09:44 PM