Share News

Rahul Gandhi: కాంగ్రెస్ వస్తే మహిళలకు 50శాతం రిజర్వేషన్లు.. రాహుల్ సంచలన ప్రకటన

ABN , Publish Date - Mar 29 , 2024 | 06:04 PM

లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు హామీల వరద పారిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇస్తున్న హామీలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. శ

Rahul Gandhi: కాంగ్రెస్ వస్తే మహిళలకు 50శాతం రిజర్వేషన్లు.. రాహుల్ సంచలన ప్రకటన

లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు హామీల వరద పారిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇస్తున్న హామీలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. శక్తిమంతమైన మహిళలు దేశ భవితవ్యాన్ని మారుస్తారని రాహుల్ ( Rahul Gandhi ) అన్నారు. నేటి కాలంలో ప్రతి ముగ్గురు పని చేసే వారిలో ఒకరు మాత్రమే మహిళ ఉన్నారని తెలిపారు. అంతే కాకుండా ప్రతి 10 మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒకరు మాత్రమే స్త్రీలు ఉన్నారని చెప్పారు. భారతదేశంలో మహిళల జనాభా 50 శాతం ఉన్నప్పటికీ హయ్యర్ సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించలేరా అని ప్రశ్నించారు.

దేశ జనాభాలో సగం మందికి పూర్తి హక్కులు రావాలని కాంగ్రెస్ కోరుకుంటోందని రాహుల్ అన్నారు. దేశాన్ని నడిపే ప్రభుత్వంలో మహిళలకు సమాన సహకారం ఉన్నప్పుడే మహిళల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోగలమని పార్టీ విశ్వసిస్తోందని వివరించారు. దేశంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో సగం రిక్రూట్‌మెంట్‌ను మహిళలకే కేటాయించాలని పార్టీ నిర్ణయించిందని ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాకుండా పార్లమెంట్‌, అసెంబ్లీల్లో మహిళా రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేయాలని రాహుల్ వివరించారు.

Janasena: జగన్ జమానాలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా ఏపీ.. నాదెండ్ల మనోహర్..


"సురక్షితమైన ఆదాయం, భవిష్యత్తు, స్థిరత్వం, ఆత్మగౌరవం ఉన్న మహిళలు అర్థం చేసుకునే శక్తిగా మారతారు. 50 శాతం ప్రభుత్వ పదవుల్లో మహిళలు ఉండటంతో దేశంలోని ప్రతి మహిళకు బలం చేకూరుతుంది" అని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాగా.. మహాలక్ష్మి హామీ కింద పేద కుటుంబంలోని ప్రతి మహిళకు నేరుగా నగదు అందజేస్తామని, సంవత్సరానికి ₹ 1 లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ ఇప్పటికే వెల్లడించింది.

Elections 2024: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు.. ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు అందాయంటే..

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 06:04 PM