Home » ABN
బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు చేసిన కామెంట్స్ తెలంగాణ ( Telangana ) రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గులాబీ పార్టీపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు రఘునందన్ రావు. బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్ అని ఎద్దేవా చేశారు.
దిల్లీ మద్యం కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) జారీ చేసిన ఆర్డర్స్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించాయి. దీనిని సీరియస్ గా తీసుకున్న ఈడీ.. కాగితాలు, కంప్యూటర్ ను తాము సమకూర్చలేదని, అవి ఆయనకు ఎలా వచ్చాయో చెప్పాలంటూ మంత్రి అతిశీని ప్రశ్నించింది.
మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు - 2024 ( Lok Sabha Elections - 2024 ) కోసం అభ్యర్థులతో కూడిన ఐదో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్య నేతలు, సీనియర్ నాయకులతో పాటు కొత్త వారు సైతం ఉన్నారు.
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ( Kejriwal ) సీఎం పదవికి రాజీనామా చేయలేదు. జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తారని పార్టీ నేతలు స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ ఈడీ కస్టడి నుంచి తొలి ఆర్డర్స్ సైతం జారీ చేసేశారు.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటనలో తలమునకలయ్యాయి. ఏయే స్థానాల నుంచి ఏయే అభ్యర్థులను పోటీలోకి దించాలనే విషయంపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. అయితే పార్టీ నేతలే కాకుండా పార్టీ పెద్దలు, అగ్ర నాయకులు పోటీ చేసే స్థానాలపై సైతం ఉత్కంఠ నెలకొంటోంది.
కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడిగి చేసిన కామెంట్స్ దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మోదీ మోదీ అని నినాదాలు చేసే యువతను చెప్పుతో కొట్టాలని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా హోలీ సంబరాల కోసం రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నారు. స్వస్థలాలకు వెళ్లిన ప్రజలు, అక్కడి నుంచి తిరుగు పయనమవుతున్న వారిలో రైళ్లు రద్దీగా మారాయి. నెలల ముందు నుంచే టికెట్ బుక్ చేసుకున్నా కన్ఫార్మ్ కాని పరిస్థితి.
తెలుగు వారి ఆత్మ గౌరవం నినాదంతో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ పార్టీ నేడు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చొరవతో అరుదైన రికార్డును సాధించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార వైసీపీకి వరస షాక్ లు తగులుతున్నాయి. వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బొడ్డు నోబుల్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోదీపై అసభ్య పదజాలంతో విమర్శించారనే ఆరోపణలతో తమిళనాడు ( Tamil Nadu ) మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌పై తూత్తుకుడిలో కేసు నమోదైంది. తిరుచెందూర్ సమీపంలోని తండుపతు గ్రామంలో ఈ నెల 22న ఇండియా కూటమి సమావేశం జరిగింది.