Indian Railway: డోర్ దగ్గర వేలాడుతూ.. ఎమర్జెన్సీ కిటికీల నుంచి దూరుతూ..
ABN , Publish Date - Mar 25 , 2024 | 09:41 PM
దేశ వ్యాప్తంగా హోలీ సంబరాల కోసం రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నారు. స్వస్థలాలకు వెళ్లిన ప్రజలు, అక్కడి నుంచి తిరుగు పయనమవుతున్న వారిలో రైళ్లు రద్దీగా మారాయి. నెలల ముందు నుంచే టికెట్ బుక్ చేసుకున్నా కన్ఫార్మ్ కాని పరిస్థితి.
దేశ వ్యాప్తంగా హోలీ సంబరాల కోసం రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నారు. స్వస్థలాలకు వెళ్లిన ప్రజలు, అక్కడి నుంచి తిరుగు పయనమవుతున్న వారిలో రైళ్లు రద్దీగా మారాయి. నెలల ముందు నుంచే టికెట్ బుక్ చేసుకున్నా కన్ఫార్మ్ కాని పరిస్థితి. దీంతో జనరల్ బోగీల్లో ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీటు కోసం చిన్నపాటి యుద్ధాలే జరుగుతున్నాయి. రైలు ఎక్కేందుకు జరిగిన ప్రయత్నాల్లో తీవ్ర గొడవలు జరిగాయి. కొన్ని చోట్ల తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో పలువులు గాయాలపాలవడం గమనార్హం. రైలు ప్లాట్‌ఫామ్ కు చేరుకోగానే ఎక్కేందుకు ప్రయాణికులు పరుగులు తీశారు.
ఉత్తర భారతంలో ఘనంగా జరుపుకునే హోలీ పండుగ కోసం స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లు కిటకిటలాడారు. బీహార్-ఉత్తరప్రదేశ్ మధ్య తిరిగే రైళ్లలో కాలు పెట్టేందుకూ సందు లేదు. తెల్లవారు జాము నుంచే జనాలు బారులు తీరారు. భారీ రద్దీ కారణంగా తలుపుల వద్ద ప్రమాదకరంగా నిల్చుని వేలాడుతూ ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. బిహార్ రాజధాని పట్నా రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కేందుకు ప్లాట్‌ఫామ్ కంటే సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఎక్కువ మంది గుమిగూడటం గమనార్హం.
అంతటితో ఆగకుండా రైలు ప్లాట్‌ఫామ్‌పైకి రాగానే రైలు తలుపుల నుంచి కాకుండా ఎమర్జెన్సీ కిటికీలోంచి లోపలికి దూరారు. ఈ సమయంలో పలువురికి గాయాలయ్యాయి. చాలా మంది వెయిటింగ్ టిక్కెట్లపై ప్రయాణిస్తున్నందు వల్ల రిజర్వ్‌డ్ కోచ్ లు జనరల్ బోగీలను తలపించాయి. కొంతమంది రైలు కప్లింగ్‌పై సైతం కూర్చొని ప్రయాణించారు. ప్రభుత్వం ప్రత్యేక రైళ్లు ప్రకటించినప్పటికీ రైళ్లల్లో ఈ మేరకు రద్దీ కనిపించడం గమనార్హం.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.