BJP vs Congress: వాయనాడ్ లోనూ అమేథీ పరిస్థితే.. రాహుల్ పై బీజేపీ సంచలన కామెంట్స్..
ABN , Publish Date - Mar 26 , 2024 | 08:02 AM
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటనలో తలమునకలయ్యాయి. ఏయే స్థానాల నుంచి ఏయే అభ్యర్థులను పోటీలోకి దించాలనే విషయంపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. అయితే పార్టీ నేతలే కాకుండా పార్టీ పెద్దలు, అగ్ర నాయకులు పోటీ చేసే స్థానాలపై సైతం ఉత్కంఠ నెలకొంటోంది.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటనలో తలమునకలయ్యాయి. ఏయే స్థానాల నుంచి ఏయే అభ్యర్థులను పోటీలోకి దించాలనే విషయంపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. అయితే పార్టీ నేతలే కాకుండా పార్టీ పెద్దలు, అగ్ర నాయకులు పోటీ చేసే స్థానాలపై సైతం ఉత్కంఠ నెలకొంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచే పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.. కాంగ్రెస్ ముఖ్య నేత సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) పోటీ చేసే స్థానంపై పెద్ద చర్చే జరిగింది. గత ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ, కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేయగా అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో పరాజయం పొందారు. దీంతో ఈసారి జరిగే ఎన్నికల్లో వాయనాడ్ నుంచి మాత్రమే పోటీ చేస్తున్నారు రాహుల్ గాంధీ.
వాయనాడ్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న కే.సురేంద్రనే చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ కు అమేథీ లాంటి ఫలితాలే వస్తాయని ఫైర్ అయ్యారు. వాయనాడ్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. నియోజకవర్గానికి రాహుల్ గాంధీ చేసిందేమీ లేదని విమర్శించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడ్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానం నుంచి పోటీ చేశారు. ఈసారి అమేథీ నుంచి కాంగ్రెస్ ఇంకా ఎవరి పేరును ప్రకటించకపోవడం గమనార్హం.
Congress: మోదీ నినాదాలు చేసేవారిని చెప్పుతో కొట్టండి.. మంత్రి సంచలన కామెంట్స్..
అమేథీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీని పోటీకి దింపాలని అమేథీ స్థానిక కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ ఇద్దరిలో ఎవరి పేర్లనూ అధిష్ఠానం ప్రకటించలేదు. సోనియా గాంధీ ఎంపీగా ఉన్న రాయ్ బరేలీ స్థానం నుంచి ఈసారి ప్రియాంక గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నాయి.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.