Home » Actor
నేను భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించను. అసిస్టెంట్ డైరక్టర్‌గా నా వృత్తి జీవితాన్ని ప్రారంభించినప్పుడు- సమాజానికి ఏదో ఒకటి చేయాలనుకొనేవాణ్ణి. అదొక కోణం. కానీ నేను ఎప్పుడూ రియాలిటీలోనే బతుకుతూ ఉంటా. అయితే ఏదో చేయాలనే తపన మాత్రం నన్ను వెంటాడుతూ ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి (Kutami) 164స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్‌కు పెద్దఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో మత్తులో ఊగుతూ మస్త్‌గా ఎంజాయ్ చేస్తూ.. ఏపీ, తెలంగాణకు చెందిన పులువురు రాజకీయ, సినీ ప్రముఖులు పట్టుబడ్డారు. వారిలో పలువురు సీరియల్ నటులు, మోడల్స్ ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారి బర్త్‌డే సందర్భంగా బెంగళూరులోని ఓ ఫాంహౌ్‌సలో ఈ రేవ్ పార్టీ నిర్వహించారు.
అజయ్ ఘోష్.. ఈ పేరు వినగానే ఏ బెంగాలీ నటుడో అనిపిస్తుంది.కానీ ఆయన పక్కా లోకల్. అచ్చంగా తెలుగోడు.ఆయన తండ్రి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అజయ్ ఘోష్
Andhrapradesh: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై సినీ నటుడు పృథ్వీరాజ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాపు సమాజం ముద్రగడను అసహ్యించుకుంటోందంటూ వ్యాఖ్యలు చేశారు. గురువారం భీమవరంలో జనసేన కూటమి అభ్యర్థి అంజిబాబు తరుపున ఎన్నికల ప్రచారంలో పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడను దుమ్మెత్తిపోశారు.
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను నాలుగు రోజుల పోలీస్ రిమాండ్‌కు ముంబై కోర్టు ఆదివారంనాడు ఆదేశించింది. 'స్టయిల్', 'ఎక్స్యూజ్ మీ' వంటి పలు హిందీ చిత్రాల్లో సాహిల్ నటించారు.
చెన్నై: కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వేలూరు ప్రజలతో మమేకం అవుతున్న ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఛాతిలో నొప్పి రావటంతో పక్కనే ఉన్న వాలంటీర్లు ఆసుపత్రికి తరలించారు.
లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుస్తామని భారతీయ జనతా పార్టీ ధీమాతో ఉంది. ఈ సారి 400 సీట్లు గెలుస్తామని ఆత్మవిశ్వాసంతో ఉంది. పలు వేదికల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ప్రధాని మోదీ, బీజేపీ పేరు ఎత్తకుండా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ టెలివిజన్ షోలలో ఒకటైన సీఐడీ ఫేం దినేశ్ ఫడ్నీస్ సోమవారం మృతి చెందారు. 57 సంవత్సరాల వయసున్న ఈయన కొంతకాలంగా...
కన్నడ నటుడు నాగభూషణ కర్ణాటకలోని బెంగళూరులో కారును వేగంగా నడుపుతూ ఫుట్‌పాత్‌పై ఉన్న జంటను ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. శనివారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆయన కారు తొలుత విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వసంతనగర్ మెయిన్ రోడ్డుకు సమీపంలో వాకింగ్ చేస్తున్న జంటను ఢీకొంది.