Share News

Chennai News: కమల్ హాసన్‌కు రాజ్యసభ సభ్యత్వం..

ABN , Publish Date - Apr 15 , 2025 | 07:19 AM

లెజెండరీ యాక్టర్, కమల్‌ హాసన్‌ పెద్దల సభకు వెళ్లనున్నట్లు సమాచారం. ఆయనను రాజ్యసభకు పంపాలని మక్కళ్‌ నీది మయ్యం పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. 2021 శాసనసభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న మక్కళ్‌ నీది మయ్యం పార్టీకి.. రాజ్యసభ సీటు ఒకటి కేటాయించేలా ఒప్పందం కుదిరినట్లు తెలియవచ్చింది.

Chennai News: కమల్ హాసన్‌కు రాజ్యసభ సభ్యత్వం..
Kamal Haasan

చెన్నై: విలక్షణ నటుడు (Typical actor), మక్కళ్‌ నీది మయ్యం పార్టీ (Makkal Needhi Maiam) అధ్యక్షుడు (Chief) కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ఎంపీ (MP)గా (రాజ్యసభ సభ్యుడిగా) పదవి బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. తమిళనాడు (Tamilnadu)లోని కోయంబత్తూర్‌లో నిన్న (సోమవారం) అంబేడ్కర్‌ జయంతి (Ambedkar Jayanti) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మక్కళ్‌ నీది మయ్యం పార్టీ ఉపాధ్యక్షుడు తంగవేల్‌ (Thangavel) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కమల్‌ హాసన్‌ను రాజ్యసభకు పంపాలని పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించిందని చెప్పారు. 2021 శాసనసభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న మక్కళ్‌ నీది మయ్యం పార్టీకి.. రాజ్యసభ సీటు ఒకటి కేటాయించేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. డీఎంకేకు చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యుల పదవీకాలం జులైలో ముగియనుంది. ఈ క్రమంలో ఒక స్థానం కమల్‌ హాసన్‌కు ఇచ్చే అవకాశం ఉంది.

Also Read..: కాంగ్రెస్ పార్టీ కోరితే రాజకీయాల్లోకి వస్తా


కాగా లెజెండరీ యాక్టర్ కమల్‌హాసన్‌ తీస్తున్న సినిమాలను స్పీడ్‌గా పూర్తి చేస్తున్నారు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘థగ్ లైఫ్’(Thug Life) సినిమాను పూర్తి చేశారు. ఈ మోస్ట్ అవైటెడ్‌ చిత్రం జూన్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే థగ్ లైఫ్ పూర్తి చేసిన వెంటనే కమల్‌ మరో సరికొత్త ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలు త్వరగా పూర్తి చేసుకుని ఆయన రాజ్య సభ పదవి బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలియవచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ అంబేడ్కర్‌ విదేశీ విద్య

భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

For More AP News and Telugu News

Updated Date - Apr 15 , 2025 | 07:19 AM