Home » Akhilesh Yadav
కాంగ్రెస్ పార్టీపై సమాజ్‌వాది పార్టీ(Samajwadi Party) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ఆగ్రహం చల్లారినట్లు లేదు. తాజాగా ఆయన ఆ పార్టీపై చేసిన విమర్శలు ఇండియా కూటమిలో తీవ్ర కల్లోలం రేపుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే కులగణన(Caste Census) చేపడతామంటున్న కాంగ్రెస్(Congress) పార్టీకి ప్రస్తుతం వెనకబడిన కులాలు, తెగల మద్దతు లేదని అఖిలేష్ విమర్శించారు.
వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. కొన్ని విపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఈ కూటమి విజయవంతంగా మూడు సమావేశాలు...
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమిలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయా? అంటే.. తాజా పరిణామాలు అందుకు అవుననే సమాధానాలు చెప్తున్నాయి.
స్వాంతంత్ర్య సమరయోధుడు, ఎమర్జెన్సీ వ్యతిరేక నేత జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా లక్నోలోని జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ వద్ద బుధవారంనాడు హైడ్రామా చోటుచేసుకుంది. భద్రతా కారణాల సాకుతో అధికారులు అనుమతి నిరాకరించడంతో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు జేపీఎన్ఐసీ ప్రహరీగోడలు ఎక్కి లోపలకు వెళ్లారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ఇండియా కూటమి నేతలు స్పందిస్తున్నారు. ముందుగా పశ్చిమబెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనూహ్య రీతిలో టీడీపీ చీఫ్ అరెస్ట్‌పై స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు సరికాదని అన్నారు. ఇప్పుడు తాజాగా యూపీ మాజీ సీఎం, ఎస్పీ (సమాజ్ వాది పార్టీ) అధినేత అఖిలేష్ యాదవ్ .. చంద్రబాబు అరెస్ట్‌పై ట్వీట్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సుధాకర్ సింగ్ ఘనవిజయం సాధించారు. తన బీజేపీ ప్రత్యర్థి దారా సింగ్ చౌహాన్‌పై ఏకంగా 42,759 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో...
ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సుధాకర్ సింగ్‌ను గెలిపించాలని ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేస్తున్న బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలన్నారు.
ఉత్తర ప్రదేశ్ శాసన సభలో శుక్రవారం నవ్వులే నవ్వులు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్ మధ్య జరిగిన సంభాషణ సభలో ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించింది. ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని శివపాల్ యాదవ్ కోరడంతో సీఎం చతురతతో స్పందించి, నవ్వులు పూయించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఆసుపత్రుల్లో కాలం చెల్లిన మందులతో మరణాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ ) చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. మందులు, ఇంజెక్షన్లు తీసుకునేందుకు ముందు వాటిని పరీక్షించాలని ప్రజలను ఆయన హెచ్చరించారు.
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు ఊహించని దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే దారా సింగ్ చౌహాన్ అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది.