Home » Amaravati
రాష్ట్రంలో ఖరీఫ్ సాగు ముగిసింది. ఈ సీజన్లో 32.50 లక్షల హెక్టార్ల సాగు లక్ష్యంలో 27.44 లక్షల హెక్టార్లలో (84%) పంటలు సాగయ్యాయి. గతేడాది ఖరీ్ఫలో 24.09 లక్షల హెక్టార్లలోనే సాగు జరిగింది.
పశుసంవర్థక శాఖలో రెండేళ్ల క్రితం ఐస్లైన్డ్ రిఫ్రిజరేటర్ల (ఐఎల్ఆర్) కొనుగోలులో నిధుల గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
రాష్ట్ర శాసనసభ స్పీకరు చింతకాయల అయ్యన్న పాత్రుడు అమెరికాలో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
తిరుమల లడ్డూ వివాదంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కల్తీ నెయ్యి సరఫరా చేశారని టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుతో తిరుపతిలో ఏఆర్ డెయిరీపై కేసు నమోదు అయ్యింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
తిరుమల పర్యటన రద్దు చేసుకున్న మాజీ సీఎం జగన్పై ఏపీ సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే వైసీపీ అధినేత జగన్ పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రి ఆరోపించారు.
వెంకటరెడ్డి పట్టుబడ్డారా లేక లొంగిపోయారా.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదే పెద్ద ప్రశ్న. గురువారం సాయంత్రం హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. వెంకట రెడ్డిని శుక్రవారం వేకువజామున బెజవాడకు తీసుకొచ్చారు. శుక్రవారం మధ్యాహ్నంలోపు కోర్టులో ప్రవేశపెట్టి విచారణ నిమిత్తం ఆ తర్వాత కస్టడీకి తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.
విశాఖపట్నం: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం ఆరున్నర గంటలకు సింహాచలం వరాహనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ప్రధాన అర్చకులు, అధికారులు లోకేష్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చిత్తూరు జిల్లా, బంగారు పాళ్యం మండలం, చిత్తూరు- బెంగుళూరు జాతీయ రహదారి మొగిలి ఘాట్లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళుతూ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒక లారీకి మంటలంటుకుని ఖాళీ బూడిద అయింది.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో 16 మంది ఐపీఎస్(IPS) అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ బదిలీ అయ్యారు. ఎం.రవిప్రకాశ్ పీ అండ్ ఎల్ ఐజీగా బదిలీ అయ్యారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 28న తిరుమలకు వెళ్లి పూజలు చేయనున్నట్లు ప్రకటించడంపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని పరీక్షల్లో నిర్ధారణ అయినా జగన్ అబద్ధాలు ఆడుతున్నారంటూ మంత్రి మండిపడ్డారు.