Share News

Arrest: గ్యాంగ్‌రేప్‌ కేసులో ఐదుగురి అరెస్టు..

ABN , Publish Date - Oct 16 , 2024 | 12:00 PM

అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రత్న(SP Ratna) తెలిపారు. హిందూపురం డీఎస్పీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు.

Arrest: గ్యాంగ్‌రేప్‌ కేసులో ఐదుగురి అరెస్టు..

హిందూపురం(అనంతపురం): అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రత్న(SP Ratna) తెలిపారు. హిందూపురం డీఎస్పీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. చిలమత్తూరు(Chilamathur) మండలం నల్లబొమ్మనపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న మిల్లులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న కుటుంబంలో అత్తాకోడలిపై ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి ఆరుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దుండగులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: CM Chandrababu Naidu: తీరు బాలేదు తమ్ముళ్లూ!


డీఎస్పీ మహేష్‌(DSP Mahesh) ఆధ్వర్యంలో సీఐలు ఆంజనేయులు, కరీం, రాఘవన్‌, జనార్దన్‌ ఈ కేసు దర్యాప్తు చేపట్టారనీ, నిందితుల్లో ఐదుగురిని హిందూపురం డంపింగ్‌ యార్డ్‌ వద్ద మంగళవారం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. తమ విచారణలో నిందితులు నేరం ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. హిందూపురం పట్టణంలోని త్యాగరాజ్‌ నగర్‌కు చెందిన మోస్ట్‌వాంటెండ్‌ క్రిమినల్‌, అంతర్రాష్ట్ర దొంగ ఎరుకల కావడి నాగేంద్ర అలియాస్‌ నాగ, అలియాస్‌ రోబో, అదే ప్రాంతానికి చెందిన సాకే ప్రవీణ్‌కుమార్‌, ముగ్గురు మైనర్లను అరెస్టు చేశామని తెలిపారు.


ఎరుకల నాగేంద్ర, సాకే ప్రవీణ్‌కుమార్‌, పరారీలో ఉన్న చాకలి శ్రీనివాస్‌ పాత నేరస్థులని తెలిపారు. నాగేంద్ర 37 కేసుల్లో నిందితుడనీ, మరో 30కిపైగా కేసులను కోర్టు కొట్టివేసిందని తెలిపారు. సాకే ప్రవీణ్‌ కుమార్‌పై లేపాక్షి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హత్య కేసు ఉందనీ, పరారీలో ఉన్న మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ చాకలి శ్రీనివాసులుపై హిందూపురం రూరల్‌ పోలీసు స్టేషన్‌లో దోపిడీ కేసు ఉందని తెలిపారు.


నిందితులు ఆరుగురు రెండు ద్విచక్రవాహనాల్లో చోరీ కోసం వెళ్లారని, అప్పటికే మిల్లు వద్ద వాచ్‌మన్‌గా ఉంటున్న కర్ణాటక కుటుంబంపై కన్నేశారని ఎస్పీ తెలిపారు. రెండు, మూడుసార్లు రెక్కీ నిర్వహించారని, ఈనెల 11న అర్ధరాత్రి దాటాక అక్కడికి వెళ్లి ద్విచక్ర వాహనాలు ఆపారని, కుక్కలు మొరగడంతో వాచ్‌మన్‌ టార్చ్‌లైట్‌ వేసి చూశారని తెలిపారు. అరుపులు విని భార్య, కుమారుడు, కోడలు బయటకు వచ్చారన్నారు. ఇద్దరు కాపలా ఉండి, మిగతావారు అత్యాచారానికి పాల్పడ్డారన్నారు.


ఇదికూడా చదవండి: CM Revanth Reddy: సీఎం సంతకం చేసినా బదిలీల్లేవ్‌!

ఇదికూడా చదవండి: KTR: విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తున్న సర్కార్‌

ఇదికూడా చదవండి: తాళం వేస్తే కేసులు.. ఎవరి మాటల్తోనో కవ్వింపు చర్యలొద్దు

ఇదికూడా చదవండి: Gurukulas: గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించాలి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 16 , 2024 | 12:00 PM