Home » America
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలతో వరస భేటీలు నిర్వహిస్తూ ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ(బుధవారం) చార్లెస్ స్క్వబ్ హెడ్ ఆఫీస్‌ను రేవంత్ రెడ్డి, టీమ్ సందర్శించనున్నారు.
తెలంగాణకు పెట్టుబడులు సాధించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోంది. మంగళవారం న్యూయార్క్ పర్యటనలో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఆయన సమావేశమయ్యారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లో జరగనుండగా.. డెమొక్రటిక్, రిపబ్లిక్ పార్టీల నుంచి అధ్యక్ష ఎన్నికల బరిలో దిగబోతున్న అభ్యర్థులు ఫిక్స్ అయ్యారు. డెమొక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేర్లను ప్రకటించారు. అయితే తాజాగా డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసొటా గవర్నర్‌గా ఉన్న టిమ్‌వాల్ట్స్ ఎంపికయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో తొలిరోజే ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ శుభవార్త అందించింది. నగరంలో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది.
అగ్రరాజ్యం అమెరికా(america)లో మాంద్యం కారణంగా ఆగస్టు 5న స్టాక్ మార్కెట్లు(stock market) పెద్ద ఎత్తున పతనమయ్యాయి. అమెరికన్ నాస్డాక్ నాలుగు శాతం క్షీణించింది. యూరోపియన్ మార్కెట్లు ఆరు నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ భారీ పతనం కారణంగా పెట్టుబడిదారులు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు.
వాతావరణం బాగా లేకపోయినా, ప్రయాణికులు ఎవరైనా అస్వస్థతకు గురైనా, లేదా ఏదైనా ఇతర భద్రతా కారణాల వల్ల విమానాలను దారి మళ్లించడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే తాజాగా అమెరికాలో ఓ విమానాన్ని ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారో తెలిస్తే మాత్రం షాకవడం ఖాయం.
నేడు వారంలో మొదటి రోజైన సోమవారం (ఆగస్టు 5న) దేశీయ స్టాక్ మార్కెట్‌కు(stock market) బ్లాక్ సోమవారంగా నిలిచిపోయింది. అయితే అమెరికా-జపాన్ మార్కెట్ల క్షీణత సందర్భంగా భారత్ ఎకానమీపై ప్రభావం చూపుతుందా అని పలువురు ప్రశ్నిస్తు్న్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్(Stock market) భారీ పతనం తర్వాత అమెరికన్ సెంట్రల్ బ్యాంక్‌పై(US federal Bank) ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటును ఊహించిన దానికంటే ముందుగానే తగ్గించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వడ్డీ రేట్లను తగ్గించడంలో సెంట్రల్ బ్యాంక్ జాప్యం చేసిందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఆసియాలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న భారత కరెన్సీ రూపాయి(Indian rupees) నేడు అత్యంత దారుణమైన స్థాయికి పడిపోయింది. ఈ క్షీణత ఇంకా కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంటున్నాయి. అయితే అమెరికా మాంద్యం భయాందోళన కారణంగా స్టాక్ మార్కెట్లలో(stock market) సూచీలు మొత్తం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
కొన్నిసార్లు విచిత్రాలు జరుగుతుంటాయి. ఒక విషయం చెబితే మరొకటి అర్థం చేసుకుంటారు. ప్రయాణించే సమయంలో మరీను.. విషయం సరిగా అర్థం కాదు. టూ వీలర్, కారు.. లేదంటే బస్సులో అయితే ఫర్లేదు.. విమానంలో జర్నీ చేసే సమయంలో ఇబ్బంది తప్పదు. అలాంటి ఘటన అమెరికాలో జరిగింది. ఓ చిన్న విషయానికి తెగ హడావిడి చేశారు. ఏకంగా విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు.