Share News

US Elections 2024: డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్‌వాల్ట్స్!

ABN , Publish Date - Aug 06 , 2024 | 09:20 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లో జరగనుండగా.. డెమొక్రటిక్, రిపబ్లిక్ పార్టీల నుంచి అధ్యక్ష ఎన్నికల బరిలో దిగబోతున్న అభ్యర్థులు ఫిక్స్ అయ్యారు. డెమొక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేర్లను ప్రకటించారు. అయితే తాజాగా డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసొటా గవర్నర్‌‌గా ఉన్న టిమ్‌వాల్ట్స్‌ ఎంపికయ్యారు.

US Elections 2024: డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్‌వాల్ట్స్!
Kamala Harris Deputy

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Elections 2024) ఈ ఏడాది నవంబర్‌లో జరగనుండగా.. డెమొక్రటిక్, రిపబ్లిక్ పార్టీల నుంచి అధ్యక్ష ఎన్నికల బరిలో దిగబోతున్న అభ్యర్థులు ఫిక్స్ అయ్యారు. డెమొక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేర్లను ప్రకటించారు. అయితే తాజాగా డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసొటా గవర్నర్‌‌గా ఉన్న టిమ్‌వాల్ట్స్‌ ఎంపికయ్యారు. అధ్యక్ష రేసులో ఉన్న కమలా హారిస్‌.. వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా వాల్ట్స్‌ను ఎంపిక చేసినట్లు అగ్రరాజ్యం మీడియా తెలిపింది. దీనిపై డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


మిన్నెసొటా గవర్నర్‌గా..

అమెరికా చట్టసభలో 12ఏళ్లపాటు సేవలందించిన టిమ్‌వాల్ట్స్‌.. 2018లో మిన్నెసొటా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. రాజకీయ వ్యూహాలతో రిపబ్లికన్‌ పార్టీని ఎండగట్టే ఆయన.. ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌లపై విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలిచేవారు. టిమ్‌వాల్ట్స్ ఆర్మీ నేషనల్‌ గార్డ్‌లో 24ఏళ్ల పాటు సేవలందించారు. డెమొక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా నిలబడటానికి పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, మిన్నెసోటా గవర్నర్ టిమ్‌వాల్ట్స్‌ ఇరువురు పోటీపడగా టిమ్‌ను అదృష్టం వరించింది. అయితే, వైస్ ప్రెసిడెంట్ నామినీ గురించి కమలా హారిస్ గానీ డెమోక్రటిక్ పార్టీగానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.


టీచర్, ఫుట్ బాల్ ట్రైనర్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారని ప్రకటించగానే.. కమలా హారిస్‌కి టిమ్ వెంటనే మద్దతు తెలిపారు. టిమ్ రాజకీయాల్లోకి రాకముందు, మిన్నెసోటాలోని మంకాటోలో హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా, ఫుట్‌బాల్ శిక్షకుడిగా పని చేశారు. మాస్టర్ సార్జెంట్‌గా పదవీ విరమణ చేశాడు. 2006లో US హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నికయ్యారు. 2018లో గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలంలో కరోనా మహమ్మారి, లాక్‌డౌన్, మాస్క్ నిబంధనలు, వ్యాక్సిన్ పంపిణీ వంటి అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు.

Updated Date - Aug 06 , 2024 | 09:20 PM