Home » Anantapur
మండలపరిధిలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం రెండో ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తు లు స్వామివారి దర్శనం కోసం తరలివ చ్చారు.
మండలంలో కాసుకో... పోలీస్... అంటూ దొంగలు సవాల్ విసురుతు న్నారు. తరచూ ఏదో ఒక గ్రామంలో పోలీసులకు పట్టుబడకుండా చోరీలు చేస్తున్నారు. ఇంటి తాళం వేశారా... ఆ ఇల్లు గుల్ల కావల్సిందే. దాదాపు ఐదు నెలల నుంచి జరిగిన చోరీలకు సంబంఽ దించి బంగారం, నగదు కలిపి రూ. కోటీ దాకా లూటీ అయి నట్లు తెలుస్తోంది. వ్యవసాయ పొలాల్లోని పరికాలనూ దొంగలిస్తు న్నారు.
అన్న దాతలను ట్రాన్సఫార్మర్ల కష్టాలు నిత్యం వెంటా డుతున్నాయి. కొత్త సర్వీసుల కోసం దరఖాస్తు చేసు కుని డీడీలు చెల్లించిన వారికి సకాలంలో ట్రాన్స ఫార్మర్లు అందడం లేదు. అలాగే పొలాల్లోని పాత ట్రాన్సఫార్మర్లు పలు కారణాల వలన పాడైనా సకాలం లో కొత్తవి అందడం లేదు.
రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలకు కనగానపల్లి జిల్లా పరిషత పాఠశాల విద్యార్థి మనోహర్ ఎంపికైనట్టు పీడీ రమేశ తెలిపారు. జిల్లా స్కూల్ గేమ్స్ఫెడరేషన ఆధ్వర్యంలో శనివారం జిల్లా స్థాయి బేస్బాల్ పోటీలు అనంత పురంలో జరిగాయి.
ప్రకృతి వైపరీత్యాల వల్ల వ్యవసాయంతో పాటు ఆ తరువాత అత్యంత ప్రాధాన్యం కల్గిన పశుపోషణ మండలంలో ని రైతులకు భారంగా మారింది. దీనికి తోడు పశువు లకు వ్యాధులు సోకినప్పుడు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయి.
ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో జమిలి ఎన్నికలు (ఒకే దేశం - ఒకే ఎన్నిక) అనేది సాధ్యం కాని అంశమని సీపీఎం రాషట్ట్ర నాయకుడు ఓబులు అన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు శనివారం అనంతపురం రూరల్ పంచాయతీలోని జేఎనటీయూ రోడ్డులో ప్రజా పోరుయాత్ర కార్యక్ర మాన్ని ప్రారంభించారు.
సభ్యత్వ నమోదు వల్ల ఉప యోగా ల గురించి నాయకులు, కార్యకర్తలు ప్రజలకు విస్తృతంగా తెలియ జేసి, మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. ఆమె శనివారం స్వగ్రామమైన వెంకటాపురంలో చేపట్టిన టీడీపీ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.
ప్రయాణికుల రద్దీ నియంత్రణకు రైల్వే శాఖ అనంతపురం మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు-బరౌనీ ప్రత్యేక రైలు (నం. 06563)ను ఈ నెల 12, 19 తేదీల్లో బెంగళూరులో రాత్రి 9-15 గంటలకు బయలుదేరి రెండు రోజుల తర్వాత 14, 21 తేదీలలో రాత్రి 8 గంటలకు బరౌనీకి చేరుకుంటుందన్నారు.
జిల్లాలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సీపీఎం ఆధ్వర్యంలో ప్రజాపోరు చేపట్టినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ పేర్కొన్నారు. సీపీఎం ఆధ్వర్యం లో శుక్రవారం నుంచి ఈ నెల 14వ తేదీ వరకు చేపడుతు న్న ప్రజాపోరులో భాగంగా తొలిరోజున రాజీవ్ కాలనీ పం చాయతీలోని పలు కాలనీల్లో ప్రచారం నిర్వహించారు.
గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తూ, పంచాయతీల ఆదా యం పెంచడమే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. రాప్తాడు నియోజక వర్గంలోని ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, ఎనఆర్ఈజీఎస్, పీఆర్ ఇంజనీర్లతో ఎమ్మెల్యే శుక్రవారం నగరంలోని పరిటాల క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.