MLA SUNITA : సభ్యత్వ నమోదును వేగవంతం చేయండి
ABN , Publish Date - Nov 10 , 2024 | 12:37 AM
సభ్యత్వ నమోదు వల్ల ఉప యోగా ల గురించి నాయకులు, కార్యకర్తలు ప్రజలకు విస్తృతంగా తెలియ జేసి, మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. ఆమె శనివారం స్వగ్రామమైన వెంకటాపురంలో చేపట్టిన టీడీపీ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.
ఎమ్మెల్యే పరిటాల సునీత
రామగిరి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): సభ్యత్వ నమోదు వల్ల ఉప యోగా ల గురించి నాయకులు, కార్యకర్తలు ప్రజలకు విస్తృతంగా తెలియ జేసి, మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. ఆమె శనివారం స్వగ్రామమైన వెంకటాపురంలో చేపట్టిన టీడీపీ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఇంటింటికీ వెళ్లి సభ్యత్వ నమోదు వల్ల కలిగే ప్రయోజ నాలను, టీడీపీ కార్యక్రమాల గురించి వివరించాలన్నారు. సభ్యత్వనమోదు తీసుకుంటే రూ.5లక్షల వరకు బీమా ఉంటుందన్నారు. సహజ మరణాలు జరిగితే మట్టి ఖర్చులకు రూ.10వేలు, కుటుంబంలో పెద్దకు ఇబ్బంది కలిగితే వారి పిల్లల చదువులు, ఉద్యోగాల బాధ్యత ఎన్టీఆర్ ట్రస్టు తీసుకుంటుందన్న ఆంశాలపై వివరించాలన్నారు. టీడీపీ కార్యకర్త అంటే సమాజంలో గౌరవం ఉందని, మనం అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలని సూచించారు. అదేవిధం గా కనగానపల్లి మండల ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ రిజ్వాన ఎమ్మెల్యే పరిటాలసునీతను శనివారం కలిశారు. విధి నిర్వహణలో పార్టీల కు అతీతంగా పనిచేయాలని ఆమె ఎస్‌ఐకి సూచించారు.
కందిపంటను పరిశీలించిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం స్వగ్రామ మైన వెంకటాపురం పొలాల్లో రైతులు సాగు చేసిన కందిపంటను పరిశీలించారు. మండల వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించి, రైతులకు సూచనలు ఇచ్చారు. 25వేల ఎకరాల వరకు నియోజకవర్గంలో కందిపంట సాగుచేశారని, వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు పొలాల్లో పర్యటిస్తూ రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....