Share News

CPM : ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాపోరు

ABN , Publish Date - Nov 09 , 2024 | 12:25 AM

జిల్లాలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సీపీఎం ఆధ్వర్యంలో ప్రజాపోరు చేపట్టినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్‌ పేర్కొన్నారు. సీపీఎం ఆధ్వర్యం లో శుక్రవారం నుంచి ఈ నెల 14వ తేదీ వరకు చేపడుతు న్న ప్రజాపోరులో భాగంగా తొలిరోజున రాజీవ్‌ కాలనీ పం చాయతీలోని పలు కాలనీల్లో ప్రచారం నిర్వహించారు.

CPM : ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాపోరు
CPM leaders campaigning in Rajiv Colony

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్‌

అనంతపురం కల్చరల్‌, నవంబరు 8(ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సీపీఎం ఆధ్వర్యంలో ప్రజాపోరు చేపట్టినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్‌ పేర్కొన్నారు. సీపీఎం ఆధ్వర్యం లో శుక్రవారం నుంచి ఈ నెల 14వ తేదీ వరకు చేపడుతు న్న ప్రజాపోరులో భాగంగా తొలిరోజున రాజీవ్‌ కాలనీ పం చాయతీలోని పలు కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంభూపాల్‌ మాట్లా డుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకమునుపు అనేక హామీలను ఇచ్చి, ఇపుడు అమలు చేయడంలో జాప్యం చేస్తున్నాయని విమర్శించారు. అలాగే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా ధరలు పెరిగాయని తెలిపారు. మహిళలు, దళితులు, బాలికల పై నిత్యం అత్యాచారాలు, హత్యలు, దాడులు జరుగుతున్నాయన్నారు. చదువుకున్న యువత కు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వం ఎన్నికల మునుపు ఇచ్చిన ఉచిత ఇసుక హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళలందరికీ సంవత్సరానికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇవ్వాలని, విద్యుత చార్జీలను తగ్గించాలని, స్మార్ట్‌ మీటర్లు రద్దు చేయని డిమాండ్‌చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 14వ తేదీన ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నగర ఒకటో కమిటీ కార్యదర్శి రామిరెడ్డి, రాజీవ్‌ కాలనీ ఉపసర్పంచ మసూద్‌, సీపీఎం నగర నాయకులు ప్రకాష్‌, వలి, నూరుల్లా, డేవిడ్‌, మహదేవ్‌నగర్‌ శాఖ కార్యదర్శి వెంకట శ్రీనివాసులు, గనేనాయక్‌ కాలనీ కార్యదర్వి రాము, లాలు, ఆది, రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 09 , 2024 | 12:29 AM