Home » Ananthapuram
గుత్తి రైల్వే జంక్షన పరిధిలో సీఆర్ఎస్ అభయ్కుమార్ రాయ్ శనివారం పర్యటిస్తారని రైల్వే శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. గుత్తి పట్టణ శివారులోని కర్నూలు రోడ్డులో నిర్మిస్తున్న బైపాస్ రైల్వే స్టేషన భవనాన్ని, ప్లాట్ ఫాం పనులను ఆయన పరిశీలిస్తారు.
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా 97వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
అనంతపురం నగరంలో వంకర, టింకర రోడ్డుపై విచారణ చేసి నిష్పక్షపాతంగా రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కోరారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో కలెక్టర్ నాగలక్ష్మికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. అవే సంస్థ ఆధ్వర్యంలో గతంలో కలెక్టరేట్ ఎదుట ఫాదర్ఫెర్రర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు.. రోడ్దు విస్తరణ పేరుతో ఫాదర్ ఫెర్రర్ విగ్రహాన్ని తొలగించి, తిరిగి పునఃప్రతిష్టంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
కక్కలపల్లి మార్కెట్లో టమోటా గరిష్ఠ ధర (15కిలోల బాక్సు) రూ.135 పలికింది. ఆదివారం మార్కెట్కు 580 టన్నుల దిగుబడులు వచ్చాయి.
సత్యసాయిబాబా జయంతి వేడుకల సందర్భంగా ఈనెల 22, 23 తేదీల్లో ధర్మవరం నుంచి పుట్టపర్తికి ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ డీఎం మోతీలాల్నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రైతుభరోసా కేంద్రాల్లో 2020-21 రబీ సీజనలో పంట రుణాలపై సున్నా వడ్డీ రాయితీకి అర్హులైన రైతుల జాబితా ప్రదర్శించడంపై వ్యవసాయ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు.
సత్యసాయి శతజయంతి వేడుకల నాటికి విశ్వమంతా నారాయణసేవ నిర్వహిస్తామని సత్యసాయి సేవాసంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీ్షపాండే పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్లను ట్రస్టు సభ్యులు ఆర్జే రత్నాకర్, చక్రవర్తి, డాక్టర్ మోహన, నిమీ్షపాండే విడుదల చేశారు.
గుంతకల్లు డివిజన కేంద్రంలో ని రైల్వే స్టేషనలో పారిశుధ్యం లోపించి మురికి కూపంగా మా రింది. పారిశుధ్య కార్మికులు సగానికి తగ్గిపోగా ప్లాట్ఫారాలు, వెయిటింగ్ హా ళ్లు దుర్గంధభరితంగా మారాయి.
జిల్లాలోని కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి సమీపంలో బెంగళూరు - హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
కుమార్తెను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే లైగింక వేధింపులకు పాల్పడ్డాడు. చిత్రహింసలు పెట్టాడు. అనంతపురం జిల్లా (Anantapur District) ఉరవకొండ పట్టణంలోని శివరామిరెడ్డి కాలనీకి చెందిన లాలెప్ప.. కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.