Home » Ananthapuram
తాగునీటి వ్యవస్థను నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదని.. ప్రజలకు కనీస అవసరాలను తీర్చలేని జగన్మోహన్రెడ్డి(Jagan Mohan Reddy) సిగ్గుపడాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు(Kalava Srinivasulu ) ఎద్దేవ చేశారు.
అనంతపురం: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ వైద్యానికి వెళ్లి ఓ వివాహిత బలైంది. వైద్యుల నిర్లక్ష్యంతో అనంతపురంలోని చంద్ర ఆస్పత్రిలో ఓ వివాహిత మృతి చెందింది. సర్జరీ కోసం అనస్థీషియా ఇచ్చిన వెంటనే ఆమెకు గుండెపోటు రావడంతో మృతి చెందింది.
పోలీసులపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సాక్షిలో తన మీద లేని పోని ఆరోపణలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అనంతపురం జిల్లా: తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం చుట్టూ పోలీసులు మొహరించారు. జేసీ నివాసానికి వెళ్లే దారులన్నింటినీ స్పెషల్ పార్టీ పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న జేసీ అనుచరులను బయటకు పంపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరాచక పాలన నుంచి రాషా్ట్రన్ని రక్షించంని 17వ తేదీ నుంచి నిర్వహించే సీపీఐ బస్సుయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జాఫర్ పిలుపునిచ్చారు.
గుత్తి రైల్వే జీఆర్పీ పరిధిలోని బసినేపల్లి గ్రామ సమీపంలో రైలు కింద పడి కురుబ రామచంద్ర(33) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్ఐ నాగప్ప తెలిపారు.
బత్తలపల్లి, ఆగస్టు 5: ప్రజల్లో టీడీపీకి వస్తున్న ఆదరణను చూసి.. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వైసీపీ వారికి పట్టుకుందని, అందువల్లే దాడులకు పాల్పడుతున్నారని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ విమర్శించారు. పుంగనురులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడి కాన్వాయ్పైనా, టీడీపీ కార్యకర్తలపైన వైసీపీ అల్లరి మూకలు రాళ్ల దాడి చేయడా న్ని ఖండిస్తూ.. మండలకేంద్రంలో శనివారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆందోళన చేశారు.
రాబోవు ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని మహాశక్తి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్దామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పార్టీ శ్రేణులకు పిలుపినిచ్చారు.
సాకే భారతి.. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు పొందిందామె. కూలి పనులు చేసుకుంటూ.. చిన్న రేకుల షెడ్డులో జీవనం సాగిస్తూ కెమిస్ర్టీలో పీహెచ్డీ పట్టా సాధించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో పట్టా పొందిన తర్వాత ‘ అక్షర భారతి’ సమాజానికి పరిచయమైంది. ఆమె ధీనగాథ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాక.. అందరి చేత ప్రశంసలు అందుకుంది.