Anantapuram: అనంతపురం నగరంలో దారుణం..

ABN , First Publish Date - 2023-08-23T10:43:15+05:30 IST

అనంతపురం: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ వైద్యానికి వెళ్లి ఓ వివాహిత బలైంది. వైద్యుల నిర్లక్ష్యంతో అనంతపురంలోని చంద్ర ఆస్పత్రిలో ఓ వివాహిత మృతి చెందింది. సర్జరీ కోసం అనస్థీషియా ఇచ్చిన వెంటనే ఆమెకు గుండెపోటు రావడంతో మృతి చెందింది.

Anantapuram: అనంతపురం నగరంలో దారుణం..

అనంతపురం: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ వైద్యానికి వెళ్లి ఓ వివాహిత బలైంది. వైద్యుల నిర్లక్ష్యంతో అనంతపురంలోని చంద్ర ఆస్పత్రిలో ఓ వివాహిత మృతి చెందింది. సర్జరీ కోసం అనస్థీషియా ఇచ్చిన వెంటనే ఆమెకు గుండెపోటు రావడంతో మృతి చెందింది.

ఉరవకొండ మండలం, పీసీ ప్యాపిలి గ్రామానికి చెందిన మోదీన్ బి పిల్లలు పుట్టేందుకు ఓ సర్జరీ చేయాలని డాక్టర్ తశ్విన్ రెడ్డి చెప్పారు. అందుకు మోదీన్ బి కూడా ఒప్పుకున్నారు. సర్జరీ చేయడానికి అనస్థీషియా డోసు ఎక్కువ కావడంతో ఆమె మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ మరణించిందని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. భార్యాభర్తలైన వన్నూరు స్వామి, మోదీన్ బికి సంతానం లేకపోవడంతో వారు చంద్ర హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఆ ఆస్పత్రిలోనే మాట్రికన్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కూడా యాజమాన్యం నిర్వహిస్తోంది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-08-23T10:43:15+05:30 IST