Home » Andhrajyothi
కావలసిన పదార్థాలు: లేత నల్లేరు కాడలు - ఒక కప్పు, నూనె - 3 టేబుల్ స్పూన్లు, నువ్వులు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు - పావు కప్పు చొప్పున. మెంతులు - పావు టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, వెల్లుల్లి - 10 రెబ్బలు, చింతపండు - చిన్న నిమ్మకాయంత, కరివేపాకు - గుప్పెడు, ఎండుమిర్చి - 15, ఉప్పు - రుచికి.
కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ - ఒక కప్పు, కొబ్బరి పాలు - 3 కప్పులు, పల్లీలు, జీడిపప్పు (కలిపి) - గుప్పెడు, నూనె: 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు - ఒక టీ స్పూను, శనగపప్పు, మినప్పప్పు - 2 టీ స్పూన్లు చొప్పున, అల్లం, పచ్చి మిర్చి తరుగు - ఒక స్పూను చొప్పున, ఉల్లితరుగు - అరకప్పు, కరివేపాకు, కొత్తిమీర - గుప్పెడు, ఉప్పు - రుచికి సరిపడా.
అనేక యజ్ఞాలు చేసిన మాంధాత పాయసం, అపూపం, మోదకాలతో వేదపండితులకు విందు ఇచ్చినట్టు భారతం ద్రోణపర్వంలో తిక్కనగారి వర్ణన ఇది. ‘‘సూపా పూపై శ్శర్కరాద్యైః పాయసైః ఫలసంయుతైః’’ యజ్ఞానంతరం వేదవిదులకు సూపం (పప్పు), పంచదార చల్లిన అపూపం, పాయసం, పండ్లతో భోజనం పెట్టాలని శంకరాచార్యుల వారు లలితా త్రిశతి భాష్యంలో చెప్పారు. తిక్కన అదే రాశారు.
క్వాలిటీ స్వీట్ అంటే మహా అయితే కిలో వెయ్యి, రెండు వేల రూపాయలకు లభిస్తుంది. జైపూర్లోని ‘త్యోహార్’ అనే మిఠాయి దుకాణం ఒక ప్రత్యేకమైన స్వీటును తయారుచేసి, కిలో ఏకంగా 70 వేల రూపాయలకు అమ్ముతోంది. పది గ్రాముల బంగారం ధరకు ఇంచుమించుగా ఉన్న ఈ ‘గోల్డ్ స్వీట్’ కథేంటీ...
తాజా పండ్లలో పిండిపదార్థాలు, పీచు, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫీనాల్స్ వంటి ఎన్నో పోషకాలుంటాయి. పిండిపదార్థాల నుంచి క్యాలరీల రూపంలో శక్తి వస్తుంది. పండ్లలోని పీచు వల్ల మితంగా తీసుకున్నా ఆకలి తీరుతుంది. అదే పండ్లను జ్యూస్ చేసి వడపోసినప్పుడు వాటిలోని పీచుపదార్థాలు పోతాయి.
ఒకప్పటిలా కాదిప్పుడు. ఏదైనా చిటికెలో అయిపోవాలి. అంతా ఇన్స్టంట్! చాటింగ్లా ఒక్క ముక్కలో చెప్పాలి. యూట్యూబ్ షార్ట్స్లా అర నిమిషంలో టాలెంట్ చూపించాలి. ఇన్స్టాలో రీల్స్లా అలా వచ్చి ఇలా వెళ్లిపోవాలంతే! అందుకే నానో కల్చర్ను ఇష్టపడుతోంది కొత్తతరం.
అమరి గుయిచన్... చూడటానికి చాక్లెట్బాయ్లా కనిపిస్తాడు. అయితే నిజంగానే అతడో ‘చాక్లెట్’బాయ్. గుయిచన్ చాక్లెట్ తయారీకి దిగాడంటే మామూలుగా ఉండదు. అది తప్పకుండా ఓ కళాఖండమే అవుతుంది. ఇటీవలే ఈ ‘పేస్ట్రీ చెఫ్’ ప్రపంచంలోనే అతి పెద్ద బనానా చాక్లెట్ తయారు చేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు.
మానవ నాగరికత వికాస పరిణామం అనేక దారుల్లో సాగింది. బౌద్ధం, జైనం... ఎన్నో శతాబ్దాలుగా ఈ భూమిపై విరాసిల్లుతూనే ఉంది. ఎన్నో ప్రాంతాల్లో ఆయా ధర్మాలు, సంస్కృతులకు సంబంధించిన ఆనవాళ్లున్నాయి. క్రీ.పూ. 2వ శతాబ్దంలో జైన మతం విలసిల్లిన పాలేజైన గుహలకు సమీపంలో ఆధునిక సాంకేతికతతో ఏర్పాటుచేసిన ‘అభయ్ ప్రభావన మ్యూజియం’ ఇటీవల ప్రారంభ మైంది.
దిశా పటానీ ‘లోఫర్’తో తెలుగు తెరకు పరిచయమైనా, ఆ తర్వాత బాలీవుడ్కి మకాం మార్చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు తిరిగి దక్షిణాది వైపు దృష్టి సారించింది. మొన్న ‘కల్కి’లో రోక్సీగా మెరిసిన ఈ బోల్డ్ బ్యూటీ తాజాగా ‘కంగువా’తో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె చెబుతున్న కొన్ని ముచ్చట్లివి..
పిచ్చుక గూళ్లలా కనిపిస్తున్నాయి కానీ ఒక కళాకారుడు చేసిన గూళ్లు ఇవి. చెట్ల కొమ్మలు, ఊడలు, వేర్లతో రూపొందించిన ఈ కళాఖండాల సృష్టికర్త నార్త్ కరోలినాకు చెందిన పాట్రిక్ డౌగర్టీ. వీటిలో కొన్ని గూళ్లు 40 అడుగుల ఎత్తువి ఉండటం విశేషం.