Home » Annamalai
లోక్ సభ ఎన్నికల సమరం ముగిసింది. భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. మెజారిటీ 272 సీట్లుకాగా ఎన్డీఏ కూటమి ఇప్పటికే 293 సీట్లల్లో గెలుపొందింది. అయితే ఎన్డీఏ అభ్యర్థుల్లో చాలా మంది అత్తెసరు మెజారిటీతో ఓడిపోగా, మరి కొందరు భారీ మెజారిటీతో ప్రత్యర్థుల చేతిలో ఓటమి చవి చూశారు.
తెలంగాణ ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదని భారతీయ జనతా పార్టీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై(Annamalai) అన్నారు.
సంగారెడ్డి జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మంగళవారం సంగారెడ్డిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ..
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలైకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2022లో క్రిస్టియన్లపై అన్నామలై విద్వేష ప్రసంగం చేశారంటూ దాఖలైన క్రిమినల్ కేసు విచారణపై గతంలో ఇచ్చిన తాత్కాలిక స్టేను అత్యున్నత న్యాయస్థానం సోవారంనాడు పొడిగించింది. సెప్టెంబర్ 9వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది.
కోవై లోక్‌సభ నియోకవర్గంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 10 గంటల తరువాత ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ అన్నామలై(State Chief Annamalai)పై పోలీసులు కేసు నమోదు చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. కడలూరు(Kadaluru) జిల్లా ముల్లిపల్లం ప్రాంతానికి చెందిన దురై రామలింగం అనే బీజేపీ(BJP) కార్యకర్త తన ఎడమ చేతి చూపుడు వేలును కత్తితో కోసుకున్నాడు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షులు, కోయంబత్తూరు అభ్యర్థి కె. అన్నామలై లోక్‌సభ ఎన్నికల తొలి విడతలో ఓటు వేసిన అనంతరం ఓటర్లను ప్రభావితం చేసేందుకు కోయంబత్తూరులో డీఎంకే, ఏఐఏడీఎంకే రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేశాయని ఆరోపించారు. కరూర్‌లోని ఉత్తుపట్టిలోని పోలింగ్ బూత్‌లో అన్నామలై ఓటు వేశారు.
మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకొనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మాత్రమేనని కోయంబత్తూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Annamalai) పేర్కొన్నారు.
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై పోలీసులు కేసు నమోదు చేశారు. అవరంపాళ్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అన్నామలై నిబంధనలను అతిక్రమించారు. దాంతో కేసు నమోదు చేశారు. అన్నామలై కోయంబత్తూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతమొందించి, అవినీతిపరులందరినీ జైలుకు తరలించడమే ప్రధాని మోదీ తమిళ ప్రజానీకానికి ఇస్తున్న ప్రత్యేక గ్యారెంటీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) అన్నారు.