BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN , Publish Date - Feb 22 , 2025 | 07:09 AM
అవినీతి డీఎంకే(DMK) ప్రభుత్వాన్ని ప్రజలే ఇంటికి సాగనంపుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) జ్యోష్యం చెప్పారు.

- అవినీతి డీఎంకే ప్రభుత్వాన్ని ప్రజలే ఇంటికి సాగనంపుతారు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై
చెన్నై: అవినీతి డీఎంకే(DMK) ప్రభుత్వాన్ని ప్రజలే ఇంటికి సాగనంపుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) జ్యోష్యం చెప్పారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి బాగా పెరిగిందని, మరోవైపు శాంతిభద్రతలు క్షీణిచాఆయని, డీఎంకే ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: శంషాబాద్ నుంచి మదీనాకు ఇండిగో విమానం
హిందీ భాషను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో నిర్వహించిన ఉద్యమంలో పాల్గొన్న 15 మంది తమిళులు ప్రాణత్యాగం చేశారని అయితే, వీరి కుటుంబాల్లోని ఒక్కరికి కూడా డీఎంకే(DMK)లో గానీ, ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు కట్టబెట్టలేదని, కేవలం ఒకే కుటుంబం మాత్రమే ఆధిక్యం చెల్లిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. దేశాన్ని అభివృద్ధి బాటలోకి నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని ‘గెటౌట్ మోదీ’ అని సంభోధించే వారిని ప్రజలు రాజకీయాల నుంచి వెలివేస్తారన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్(Congress) నేతృత్వంలోని యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో డీఎంకే భాగస్వామ్యం వహించిందని, అప్పుడు రాష్ట్రానికి రూ.8,053 కోట్లు మాత్రమే కేటాయించారని, ఈ వాస్తవం తెలియక డీఎంకే సహా మిత్రపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయడం సరికాదని అన్నామలై అన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: పర్యాటకానికి అందం
ఈవార్తను కూడా చదవండి: Medak: రేవంత్ మాటలు కోటలు దాటుతున్నాయి
ఈవార్తను కూడా చదవండి: LRS: ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు నిర్ధారణ!
ఈవార్తను కూడా చదవండి: BJP.. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు
Read Latest Telangana News and National News