Home » Anupam Kher
సాధారణంగా.. రాజకీయ నేతలు, సినీ తారలు, ఇతర ప్రముఖులు రామమందిరం వంటి దేవాలయాలను సందర్శించేందుకు వీఐపీ పాస్‌లు పొందుతారు. ముఖ్యంగా.. రద్దీగా ఉన్నప్పుడు అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి, వీఐపీ దర్శనం చేసుకుంటారు. కానీ.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మాత్రం అందుకు భిన్నంగా సాధారణ భక్తుడిగా ఇతర భక్తులతో కలిసి అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు.
బాలీవుడ్ క్వీన్, ఫైర్బ్రాంబ్ కంగనా రనౌత్ మరోసారి నెపోటిజం టాపిక్‌ను లేవనెత్తారు. మరోసారి బంధుప్రీతి మాఫియా బయటపడిందంటూ ఆమె కామెంట్లు చేశారు. తాజాగా ముంబైలో జరిగిన ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ తీరుపై ఆమె కామెంట్ చేశారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (Dadasaheb Phalke International Film Festival) ముంబైలో వైభవంగా జరిగింది. సోమవారం జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ సినీ తారలు (Bollywood celebs) సందడి చేశారు.
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files). లో బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. కొన్ని రోజుల క్రితం నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఈ మూవీని తీవ్రంగా విమర్శించారు.
సొంత దేశంపైనే విమర్శలు గుప్పించే ఇజ్రాయెలీ సినీ ప్రముఖుడు నడవ్ లపిడ్ (Nadav Lapid) చేసిన వ్యాఖ్యలు
అంతర్జాతీయ భారతీయ చలర చిత్రోత్సవం(ఇఫి)లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై జ్యూరీ హెడ్, ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ‘‘ఈ సినిమా చూసి దిగ్ర్భాంతి చెందా. ఇది ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం’’ అని ఆయన చేసిన వ్యాఖ్యలను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుసమ్ ఖేర్ ఖండించారు
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఏక్నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. 'వై ప్లస్' భద్రతా కేటగిరి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సల్మా్న్‌ను చంపుతామంటూ ఆయనకు, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగు నుంచి బెదరింపు లేఖలు వచ్చాయన్న కారణంతో మహారాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.