Anupam kher - kashmir files: నిజాలు చూడలేకపోతే.. నోరు మూసుకోండి!

ABN , First Publish Date - 2022-11-29T18:33:56+05:30 IST

అంతర్జాతీయ భారతీయ చలర చిత్రోత్సవం(ఇఫి)లో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంపై జ్యూరీ హెడ్‌, ఇజ్రాయెల్‌ దర్శకుడు నడవ్‌ లాపిడ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ‘‘ఈ సినిమా చూసి దిగ్ర్భాంతి చెందా. ఇది ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం’’ అని ఆయన చేసిన వ్యాఖ్యలను బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుసమ్‌ ఖేర్‌ ఖండించారు

Anupam kher - kashmir files: నిజాలు చూడలేకపోతే.. నోరు మూసుకోండి!

అంతర్జాతీయ భారతీయ చలర చిత్రోత్సవం(ఇఫి-(IFFI)లో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ (kashmir files)చిత్రంపై జ్యూరీ హెడ్‌, ఇజ్రాయెల్‌ దర్శకుడు నడవ్‌ లాపిడ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ‘‘ఈ సినిమా చూసి దిగ్ర్భాంతి చెందా. ఇది ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం’’ అని ఆయన చేసిన వ్యాఖ్యలను బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుసమ్‌ ఖేర్‌ (Anupam kher) ఖండించారు. నిజాలు చూడలేకపోతే.. నోరు మూసుకుని కూర్చోవాలంటూ మండిపడ్డారు. ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంపై విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేశారు అనుపమ్‌ ఖేర్‌. (Anupam kher Fire on nadav lapid)

‘‘కొందమందికి నిజాలను ఉన్నది ఉన్నట్లుగా చూపించే అలవాటు ఉండదు. దాన్ని తమకు ఇష్టమొచ్చినట్లుగా మార్చి చూపిస్తుంటారు. అలాంటి వారు కశ్మీర్‌ నిజాలను జీర్ణించుకోలేకపోతున్నారు. గత 25-30 ఏళ్లుగా కశ్మీర్‌ను భిన్నమైన కోణంలో చూపిస్తున్నారు. అసలు విషయం ఏంటనేది కశ్మీర్‌ ఫైల్స్‌ బయటకు చెప్పింది. సినిమాలో నిజాలు చూపించడం కొందరి నచ్చడం లేదు. అందుకే నిజాలపై కామెంట్లు చేస్తున్నారు. నిజాన్ని అపహాస్యం చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవాలను చూడలేని వారు కళ్లు మూసుకోండి. నోరు మూసుకోండి ఎందుకంటే ఇదే కశ్మీర్‌లో జరిగిన నిజం. ఇది విషాద చరిత్రలో ఒక భాగం. మీకు అది తెలియకపోతే ఆ విషాదాన్ని అనుభవించిన వారిని ఓసారి కలిసి తెలుసుకోండి. భారత్‌, ఇజ్రాయెల్‌.. రెండు దేశాలు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయి. అందువల్ల కశ్మీరీ హిందువుల బాధను ఇజ్రాయెల్‌లో సామాన్య వ్యక్తి కూడా అర్థం చేసుకోగలరు. అయితే.. ప్రతి దేశంలోనూ దేశద్రోహులు ఉంటారు కదా. మాఇది సినిమా మాత్రమే కాదు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ఉద్యమం’’ అని అనుపమ్‌ ఖేర్‌ తన వీడియోలో పేర్కొన్నారు. ఈ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు టూల్‌కిట్‌ గ్యాంగ్స్‌ ప్రయత్నిస్తూనే ఉంటాయని ఆరోపించారు.

ఇఫీలో ల్యాపిడ్‌ చేసిన వ్యాఖ్యలను భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబారి నావొర్‌ గిలాన్‌ ఖండించారు. భారత ప్రభుత్వానికి ఆయన క్షమాపణలు తెలిపారు. ఇదే విషయంపై ఇజ్రాయెల్‌ కాన్సుల్‌ జనరల్‌ కొబ్బి షొషానీ కూడా లాపిడ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయం తెలియగానే అనుపమ్‌ ఖేర్‌కు స్వయంగా ఫోన్‌ చేసి క్షమాపణలు తెలిపారు. ‘‘లాపిడ్‌ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం. దీనికి ఇజ్రాయెల్‌తో అధికారికంగా, అనధికారికంగా ఎలాంటి సంబంధం లేదు. నాకు ఈ విషయం తెలియగానే నా స్నేహితుడు అనుపమ్‌ ఖేర్‌కు ఫోన్‌ చేసి క్షమాపణ చెప్పాను. కశ్మీర్‌ ఫైల్స్‌ ప్రచార చిత్రం కాదు. కశ్మీర్‌ బాధలను చెప్పిన బలమైన చిత్రం’ అని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2022-11-29T18:33:57+05:30 IST