Home » AP bifurcation
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయిన పలు అంశాలు ఇంకా పెండింగ్లో ఉండడంతో పాలనా పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిపై చర్చించేందుకు ఇవాళ(శనివారం) సాయంత్రం 6గంటలకు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. దీంతో పెండింగ్ సమస్యలు కొలిక్కి వస్తాయా, లేదా అని రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలంగాణ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అంశాలపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదల, అభివృద్ధికి సహకరించాలని వినతిపత్రం ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మోడీ, అమిత్ షాతో భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా నవ్యాంధ్రప్రదేశ్లో విలీనమైన భద్రాచలం మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేసేలా చొరవ తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఈనెల ఆరో తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ నేపథ్యంలో లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సోమవారం (నేడు) ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టనున్న సందర్భం, పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానం నేపథ్యంలో పాత పార్లమెంట్ భవనానికి సంబంధించిన పలు చారిత్రక ఘటనలను ఆయన గుర్తుచేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ విభజనను (andhra pradesh bifurcation) ప్రస్తావించారు.