Home » AP BJP
అవును.. దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక సీన్ మారిపోయింది..! సోమువీర్రాజు (Somu Veerraju) అధ్యక్షుడిగా ఉన్నన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.! మొదటి ప్రసంగంతోనే జగన్ సర్కార్‌ను ఏకిపారేశారు!. వైసీపీ సర్కార్ (YSRCP Govt) వైఫల్యాలను ఎత్తిచూపుతూ పురంధేశ్వరి చెడుగుడు ఆడేసుకున్నారు.!..
జనసేన ఎప్పటికీ మిత్ర పక్షమేనని కుండబద్దలుకొట్టినట్టు తేల్చిచెప్పారు. తద్వారా ఇరు పార్టీల మైత్రిపై అధ్యక్షురాలి హోదాలో స్వయంగా ఆమె క్లారిటీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్‌తో సోమువీర్రాజు మాట్లాడుతూనే ఉండేవారని, జనసేనతో సమన్వయంతో ముందుకు వెళ్తామని పురంధేశ్వరి చెప్పారు. జనసేన తమకు ఎప్పటికీ మిత్ర పక్షమేనని అన్నారు. తద్వారా జనసేన-బీజేపీ మైత్రి విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని, ఎన్నికల్లో కూడా కలసి వెళ్లే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు.
వైసీపీ అవినీతి పాలనకు అంతం పలికే రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కలిశారు. అధ్యక్షురాలిగా నియమించడంపై నడ్డాకు పురంధేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకానికి నడ్డాకు కృతజ్ఞతలు తెలిపినట్లు పురంధేశ్వరి వెల్లడించారు.
పురందేశ్వరికి బీజేపీ ప్రాధాన్యం ఇవ్వటంపై రెండు రకాల చర్చలు కొనసాగుతున్నాయి. టీడీపీని దగ్గర చేసుకునే క్రమంలో ఇదో ప్రయత్నంగా అత్యధికులు భావిస్తున్నారు. కాగా కమ్మ సామాజికవర్గం.. ప్రధానంగా టీడీపీ శ్రేణుల్లో అయోమయ స్థితిని కల్పించి వైసీపీకి ఉపయోగపడేందుకే బీజేపీ పురందేశ్వరికి పదవిని ఇచ్చిందన్న అనుమానాలు వ్యక్తం చేసేవారు లేకపోలేదు.
సోము వీర్రాజు వైఖరిపై బీజేపీ అధిష్టానం వద్ద పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం ఉంది. అంతేకాకుండా సీఎం రమేష్, సుజనా చౌదరి, సత్యకుమార్ లాంటి బీజేపీ నేతలు వీర్రాజుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
అవును.. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం (BJP High Command) భారీగా మార్పులు, చేర్పులు చేసింది. ముఖ్యంగా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో గులాబీ బాస్ కేసీఆర్‌ను (CM KCR) మూడోసారి ముఖ్యమంత్రిని కానివ్వకూడదని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మార్చింది.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమితులయ్యారు. చడీ చప్పుడు కాకుండా ఏపీ అధ్యక్షుడి పదవి నుంచి సోమువీర్రాజును తొలగించిన అధిష్టానం.. కొత్త అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన విడుదలైంది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందిగా సోముకు అధిష్టానం ఆదేశించింది.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును తొలగించారు. ఏమాత్రం చడీచప్పుడు లేకుండా ఇది జరిగిపోయింది. ఇటీవలి కాలంలో మన ఫోకస్ అంతా ఎంతసేపూ తెలంగాణ మీదే ఉంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. అధిష్టానం నుంచి బండి సంజయ్‌కు కాల్ రావడం.. ఆయన హుటాహుటిన నిన్న హస్తినకు బయలుదేరి వెళ్లడం చకచకా జరిగిపోయాయి.
నాదెండ్ల మనోహర్.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఓ గుర్తింపు ఉన్న వ్యక్తి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈయన్ను ప్రస్తుతం జనసేన పార్టీలో నంబర్-2గా అభిమానులు, కార్యకర్తలు పిలుచుకుంటున్నారు. ఎంతో మంది నేతలు వచ్చిపోతున్నా..