Daggubati Purandeswari: ఏపీలో జనసేన-బీజేపీ పొత్తుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు...

ABN , First Publish Date - 2023-07-13T18:24:07+05:30 IST

జనసేన ఎప్పటికీ మిత్ర పక్షమేనని కుండబద్దలుకొట్టినట్టు తేల్చిచెప్పారు. తద్వారా ఇరు పార్టీల మైత్రిపై అధ్యక్షురాలి హోదాలో స్వయంగా ఆమె క్లారిటీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్‌తో సోమువీర్రాజు మాట్లాడుతూనే ఉండేవారని, జనసేనతో సమన్వయంతో ముందుకు వెళ్తామని పురంధేశ్వరి చెప్పారు. జనసేన తమకు ఎప్పటికీ మిత్ర పక్షమేనని అన్నారు. తద్వారా జనసేన-బీజేపీ మైత్రి విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని, ఎన్నికల్లో కూడా కలసి వెళ్లే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు.

Daggubati Purandeswari: ఏపీలో జనసేన-బీజేపీ పొత్తుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు...

అసెంబ్లీ ఎన్నికలకు 8 నెలలు ముందుగానే రాజకీయ వాతావరణం వేడెక్కిన ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి పార్టీల పొత్తులు ఎలా ఉండబోతున్నాయి? బీజేపీ-టీడీపీ (BJP - TDP) భాగస్వామ్యం మళ్లీ రిపీట్ అవుతుందా?. బీజేపీ-జనసేన మైత్రిలో ఏమైనా మార్పు ఉంటుందా?. ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియామకం రాజకీయ సమీకరణాల్లో మార్పులు తీసుకొస్తుందా? అంటూ రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్న వేళ ఏపీ బీజేపీ నూతన చీఫ్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించాక పురంధేశ్వరి స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. మీడియాతో ఆమె చేసిన వ్యాఖ్యల ద్వారా ఏపీ బీజేపీ వైఖరి ఎలా ఉండబోతోందో తేల్చిచెప్పినట్టయ్యింది. ఇంతకీ పురంధేశ్వరి ఏం చెప్పారు, ఎలాంటి చర్చకు దారితీశాయో ఒకసారి పరిశీలిద్దాం..

జనసేన ఎప్పటికీ మిత్ర పక్షమేనని కుండబద్దలుకొట్టినట్టు తేల్చిచెప్పారు పురంధేశ్వరి. తద్వారా ఇరు పార్టీల మైత్రిపై అధ్యక్షురాలి హోదాలో స్వయంగా ఆమె క్లారిటీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్‌తో సోమువీర్రాజు మాట్లాడుతూనే ఉండేవారని, అదేవిధంగా జనసేనతో సమన్వయంతో ముందుకు వెళ్తామని పురంధేశ్వరి అన్నారు. జనసేన తమకు ఎప్పటికీ మిత్ర పక్షమేనని అన్నారు. తద్వారా జనసేన-బీజేపీ మైత్రి విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని, ఎన్నికల్లో కూడా కలసి వెళ్లే అవకాశం ఉందన్నట్టుగా క్లారిటీ ఇచ్చినట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.

మరి.. టీడీపీతో మరోసారి జత కడతారా?, ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగే అవకాశముందా అనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్న వేళ.. పొత్తులపై పార్టీ పెద్దలు చూసుకుంటారని పురంధేశ్వరి తేల్చిచెప్పారు. పరిస్థితులను బట్టి, హైకమాండ్ ఆదేశాలనుసారం ముందుకెళ్లనున్నట్టు పురంధేశ్వరి వెల్లడించారు. మరోవైపు.. ప్రజాహితం కోసం కాకుండా తన హితం కోసం సీఎం జగన్ పనిచేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న వైనంపై బీజేపీ పనిచేస్తోందని పార్టీ లైన్‌ను క్లియర్ కట్‌గా చెప్పారు. తద్వారా జగన్ సారధ్యంలోని వైసీపీ సర్కారుపై పోరాటం ఉంటుందని పురంధేశ్వరి ఫుల్ క్లారిటీ ఇచ్చినట్టయ్యిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మేరకు స్పష్టమైన సంకేతాలిచ్చినట్టయ్యిందని రాజకీయ విశ్లేషణలు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2023-07-13T18:24:07+05:30 IST