Pawan on Nadendla : ఎవరైనా సరే తగ్గేదేలే.. నాదెండ్ల ఎపిసోడ్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పవన్..!

ABN , First Publish Date - 2023-05-12T21:30:44+05:30 IST

నాదెండ్ల మనోహర్.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఓ గుర్తింపు ఉన్న వ్యక్తి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈయన్ను ప్రస్తుతం జనసేన పార్టీలో నంబర్-2గా అభిమానులు, కార్యకర్తలు పిలుచుకుంటున్నారు. ఎంతో మంది నేతలు వచ్చిపోతున్నా..

Pawan on Nadendla : ఎవరైనా సరే తగ్గేదేలే.. నాదెండ్ల ఎపిసోడ్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పవన్..!

నాదెండ్ల మనోహర్.. (Nadendla Manohar) తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఓ గుర్తింపు ఉన్న వ్యక్తి. కాంగ్రెస్ (Congress) అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈయన్ను ప్రస్తుతం జనసేన (Janasena) పార్టీలో నంబర్-2గా అభిమానులు, కార్యకర్తలు పిలుచుకుంటున్నారు. ఎంతో మంది నేతలు వచ్చిపోతున్నా నాదెండ్ల మాత్రం స్థిరంగా పార్టీలోనే ఉంటూ కార్యక్రమాలన్నీ చక్కబెడుతున్నారు. అంతేకాదు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు (Janasena Chief Pawan Kalyan) అత్యంత నమ్మకస్తుడు, నమ్మినబంటు కూడా. అందుకే ఈయన ఏం చెప్పినా.. పవన్ నోటి నుంచి వచ్చినట్లేనని జనసైనికులు (Janasainiks) భావిస్తారు. అలాంటిది ఈయనంటే గత కొన్నిరోజులుగా సొంత పార్టీ నేతలకు అస్సలు పడట్లేదు. ఏ రేంజ్‌లో అంటే.. ఆయన్ను తిట్టిపోసి.. ఆయనపైనే అధినేతకు ఫిర్యాదులు చేసే పరిస్థితి నెలకొందట. ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన్ను పార్టీ నేతలు బద్ధ శత్రువుగా చూస్తున్న పరిస్థితట. ఇలా నాదెండ్ల విషయంలో రోజురోజుకూ సొంత పార్టీలో ఇలా జరుగుతుండటంతో ఇక ఈ ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని పవన్ భావించారు. ఇంతకీ పవన్ ఏం మాట్లాడారు..? ఫైనల్‌గా నేతలు, అభిమానులకు సేనాని ఇచ్చిన సందేశమేంటి..? అనే విషయాలపై ప్రత్యేక కథనం.

Pawan.jpg

ఇంతకీ పవన్ ఏమన్నారు..?

శుక్రవారం నాడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో పొత్తులు, రాబోయే ఎన్నికల్లో పోటీ ఇలా చాలా విషయాలపై పవన్ తేల్చి చెప్పేశారు. అంతేకాదు.. ఇదే సమావేశంలో పార్టీలో విబేధాల గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ముఖ్యంగా నాదెండ్ల ఎపిసోడ్‌లో అసలేం జరుగుతోంది..? పార్టీ నేతలు ఎందుకింతలా రియాక్ట్ అవుతున్నారు..? అనే విషయాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనం మధ్యనే కూర్చొని కామన్ మినిమమ్ ప్రొగ్రాం రూపొందిస్తాం. జనసేనలో ఉండేవాళ్లకే నేను బాధ్యతలు ఇస్తాను. ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయే వాళ్లకి నేను బాధ్యతలు ఇవ్వను. పార్టీలో నాదెండ్లను చాలా మంది విమర్శిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. పార్టీలో అనుకూల శత్రువులుగా మారొద్దు. అనుకూల శత్రువులు ఎవరైనా ఉంటే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తా. మనోహర్ ఏ రోజూ నన్ను సంప్రదించకుండా ఏం మాట్లాడరు. నాదెండ్ల లాంటి వ్యక్తిని గుండెల్లో పెట్టుకోవాలి.. కానీ తూలనాడొద్దు. నేను అంటే పడి చచ్చిపోతామనే వాళ్లు.. నాదెండ్లను విమర్శిస్తున్నారు. ఇలాంటి వాళ్లను నేను వైసీపీ కోవర్టులుగానే భావిస్తాను. నా మీద కోపాన్ని నాదెండ్ల మీద చూపుతున్నారు. ఏదైనా ఉంటే నా మీదే కోప్పడండి.. నన్నే విమర్శించండి. వ్యాపారస్తులను బెదిరించొద్దు. నాకు ఫిర్యాదులు అస్సలు రాకూడదు అని ఎవరైనా సరే తగ్గేదేలే అని పవన్ తేల్చి చెప్పేశారు.

Pawan-kalyan.jpg

సీఎం అభ్యర్థి ఎవరనేది..?

నేను సీఎం కావాలంటే.. నన్ను గౌరప్రదమైన స్థానంలో కూర్చొబెట్టాలి. 48-50 శాతం ఓట్లు జనసేనకు ఇవ్వండి.. సీఎం సీటు అడుగుదాం. వైఎస్ జగన్ పచ్చని చెట్లను కొట్టేసే వ్యక్తి. ఏ కులానికి న్యాయం చేశాడు..?. ప్రతి కులానికి అన్యాయం చేసిన వ్యక్తి జగన్. జగన్ ఏపీ వ్యతిరేక వ్యక్తి. అడ్డగోలుగా సంపాదించిన వ్యక్తి. మరోసారి జగన్ సీఎం అయితే ఏపీ మళ్లీ కోలుకోదు. మన ఓటింగ్ శాతం పెరిగింది.. కానీ ఈ ఓటింగుతో ప్రభుత్వాన్ని స్థాపించలేం. అందుకే పొత్తులే కావాలంటున్నాను. కచ్చితంగా జనసేన-టీడీపీ-బీజేపీ పోత్తుతోనే ఎన్నికలకు వెళ్తాం. సీఎం అభ్యర్థి ఎవరనేది ఎన్నికలయ్యాక తేలుతుంది. ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయో చూసి ఆ తర్వాత సీఎం అభ్యర్థి ఖరారు అవుతారు. సీఎం అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు.. ఈ సీఎం ఉండకూడదనేదే ముఖ్యం. ఆవేశంతో రాజకీయం చేయకూడదు. టీడీపీ-బీజేపీలతో పొత్తుకు సిద్దమనే ప్రకటించాం. ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదు. పొత్తు ఖరారై.. విధి విధానాలు ఓకే అయితే కామన్ మినిమమ్ ప్రొగ్రాం సెట్ చేస్తాం అని పవన్ స్పష్టం చేసేశారు.

మొత్తానికి చూస్తే.. ఇన్నిరోజులుగా నాదెండ్లపై సొంత పార్టీ నుంచి వస్తున్న విమర్శల పట్ల పవన్ ఫుల్ క్లారిటీతో తేల్చేశారు. ఇకపై కూడా నాదెండ్ల పై ఫిర్యాదులు, విమర్శలు వస్తాయో లేకుంటే ఇక్కడితే అన్నీ సమసిపోతాయో వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

YS Viveka Murder Case : వివేకా హత్యకేసులో సీబీఐ కీలక నిర్ణయం.. వేలి ముద్రలను గుర్తించేందుకు..

******************************

YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో అటు సీబీఐ దూకుడు.. ఇటు కీలక పరిణామం..

******************************

Updated Date - 2023-05-12T21:37:02+05:30 IST