Home » AP CM YS Jagan
రాయి దాడి ఘటనపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద తనను కలిసిన కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలను ఆయన కలిశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసే దాడులు చేస్తున్నారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రాణాపాయం తప్పిందని, మరోసారి అధికారంలోకి వస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ అధినేత జగన్‌లో రోజురోజుకు ఓటమి భయం పెరుగుతుందా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంతో ఆందోళన చెందుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. ఈనెల 20వ తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ తాజాగా మేనిఫెస్టో విడుదల వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు పూర్తయిందన్న వైసీపీ వెనక్కి తగ్గడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పేరుకే ఆయన ఉద్యోగ సంఘాల నాయకుడు! చేసేది మాత్రం ముఖ్యమంత్రి జగన్ భజన! ఆయనే... రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్ల సంగతి పక్కనపెట్టి... శ్రుతిమించిన స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు...
మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెరలేపి... రాష్ట్రాన్ని ఒక్క రాజధాని కూడా లేకుండా చేసి..
YS Sunitha Reddy: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసు వ్యవహారం ఇప్పటికీ తేలలేదు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షించాల్సిందేనని వివేకా కుమార్తె సునీతా రెడ్డి (Sunitha Reddy) న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి (CM Jagan Reddy) బాబాయి హత్య ఘటన జరిగి ఐదేళ్లు పూర్తి కావొస్తోంది...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు కాకుంటే రాజకీయంగా జీరో. రాయలసీమలో మరీనూ. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ధనయజ్ఞం సాగించారా లేక జల యజ్ఞం మొదలు పెట్టారా అన్న వివాదాస్పద అంశాలు పక్కన బెడితే మిగులు జలాలతో ప్రతిపాదించబడి దస్త్రాలకే పరిమితమైన రాయలసీమకు చెందిన పలు సాగునీటి ప్రాజెక్టులను పట్టాలకెక్కించారు..