Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

AP Politics: ఈయనేం ‘నాయకుడు?’

ABN , Publish Date - Mar 03 , 2024 | 03:23 AM

పేరుకే ఆయన ఉద్యోగ సంఘాల నాయకుడు! చేసేది మాత్రం ముఖ్యమంత్రి జగన్‌ భజన! ఆయనే... రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్ల సంగతి పక్కనపెట్టి... శ్రుతిమించిన స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు...

AP Politics: ఈయనేం ‘నాయకుడు?’

  • ఉద్యోగ నేతా? వైసీపీ భక్తుడా?

  • వెంకట్రామిరెడ్డి వీర భజన

  • జగన్‌ ఓడిపోతే మనం ఓడినట్టే

  • ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయండి

  • సచివాలయ ఉద్యోగులకు పిలుపు

అమలాపురం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): పేరుకే ఆయన ఉద్యోగ సంఘాల నాయకుడు! చేసేది మాత్రం ముఖ్యమంత్రి జగన్‌ (CM YS Jagan) భజన! ఆయనే... రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి (Venkatrami Reddy) . ఉద్యోగుల సమస్యలు, డిమాండ్ల సంగతి పక్కనపెట్టి... శ్రుతిమించిన స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ... తాను ఒక ప్రభుత్వ ఉద్యోగిననే విషయం మరిచి ఫక్తు వైసీపీ కార్యకర్తలా మారిపోయారు. అంతేకాదు... గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులూ అలాగే మారిపోవాలని నూరిపోస్తున్నారు. ‘జగన్‌ ఓడిపోతే గ్రామ సచివాలయ ఉద్యోగులు ఓడిపోయినట్లే’ అంటూ వింత భాష్యం చెప్పారు. పైగా... ఇంటింటికీ వెళ్లి ప్రచారం కూడా చేయాలట! డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీడీవో ఆఫీసు వద్ద శనివారం వార్డు సచివాలయ ఉద్యోగులతో ఆయన సమావేశమయ్యారు.

YS-Jagan-and-Venkatrami-Red.jpg

‘వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓడిపోతే మనం ఓడిపోయినట్లే. ప్రతి సచివాలయ ఉద్యోగి వార్డు, గ్రామాల్లో ప్రతీ ఇంటికి వెళ్లి జగన్‌ను గెలిపించేలా ఎన్నికల ప్రచారం చేపట్టాలి. సచివాలయాల ద్వారా ప్రజలకు మంచి జరిగిందా లేదా అనేది రేపు జరిగే ఎన్నికల్లో నిరూపించేలా పని చేయాలి. జగన్‌కు నష్టం జరిగితే మనం ప్రజలకు మంచి సేవలు ఇవ్వనట్లే అవుతుంది’’ అని వెంకట్రామి రెడ్డి అన్నారు. అంతేకాదు... అచ్చం తన ‘వైసీ పీ బాస్‌’లాగా మీడియాపైనా విమర్శలు గుప్పించారు. ‘‘ఈనెల 10 నుంచి ‘మన ప్రభుత్వం-మన ప్రజలు’ పేరుతో ర్యాలీలు చేయండి. ఇంటింటికీ తిరిగి జగన్‌ విజయం కోసం ప్రచారం చేయండి. ప్రభుత్వం ప్రతి సచివాలయానికి ‘సాక్షి’ పత్రిక పంపిస్తోంది. వాటిలో మంచి విషయాలను ప్రజలకు తెలియచేయండి’’ అని పిలుపునిచ్చారు. ఇప్పటిదాకా వలంటీర్లను మాత్ర మే ‘సొంత కార్యకర్తల్లా’ వాడుకుంటుండగా... తాజాగా ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన, సర్వీసు నిబంధనలు వర్తించే వార్డు సచివాలయ ఉద్యోగులనూ వైసీపీ కార్యకర్తలుగా మార్చే ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం!

Updated Date - Mar 03 , 2024 | 08:24 AM