Share News

YS Jagan:రాయి దాడిపై తొలిసారి స్పందించిన జగన్.. కారణం అదేనట..

ABN , Publish Date - Apr 15 , 2024 | 12:45 PM

రాయి దాడి ఘటనపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద తనను కలిసిన కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలను ఆయన కలిశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసే దాడులు చేస్తున్నారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రాణాపాయం తప్పిందని, మరోసారి అధికారంలోకి వస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు.

YS Jagan:రాయి దాడిపై తొలిసారి స్పందించిన జగన్..  కారణం అదేనట..
CM Jagan

రాయి దాడి ఘటనపై సీఎం జగన్ (CM Jagan) తొలిసారి స్పందించారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద తనను కలిసిన కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలను ఆయన కలిశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసే దాడులు చేస్తున్నారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రాణాపాయం తప్పిందని, మరోసారి అధికారంలోకి వస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. తనను ఎలాంటి దాడులు ఆపలేవన్నారు. ప్రజల మద్దతుతో మరింత ముందుకెళ్తానన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందవద్దని జగన్ చెప్పారు. ధైర్యంతో ముందడుగు వేద్దామని కార్యకర్తలతో పేర్కొన్నారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం తమకు ఉన్నాయన్నారు. ప్రజల ఆశీస్సులతోనే దాడి నుంచి తప్పించుకోగలిగానని తెలిపారు. ఒకరోజు విరామం తరువాత సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు.

CM Jagan: జగన్ యాత్రలు.. జనానికి తిప్పలు..


ఆరోజు ఏం జరిగిందంటే..

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంంలో జగన్మోహన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ క్రమంలో ఓ గులకరాయి వచ్చి ఆయన తలకు తగిలింది. కళ్లు పై భాగాన్న నుదిటికి గాయమైన విషయం తెలిసిందే. ఈ గాయం తర్వాత విజయవాడ సమీపంలోని కేసరపల్లిలోని నైట్ హాల్ట్‌కు చేరుకున్నారు. గాయం కారణంగా ఆదివారం యాత్రకు విరామం ఇచ్చారు. గాయం నుంచి కోలుకోవడంతో సోమవారం తిరిగి మేమంతా సిద్ధం బస్సు యాత్రను జగన్ ప్రారంభించారు.


AP Politics: ఓటమిని తట్టుకోలేకనే విషసంస్కృతికి జగన్ తెర.. రాళ్ల దాడిపై కొల్లు రవీంద్ర

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 15 , 2024 | 12:59 PM