Home » AP CM
09: ఉగాది పండగ వేళ రాష్ట్రంలోని వలంటీర్లకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బంఫర్ ఆఫర్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. వలంటీర్ల జీతం నెలకు రూ. 10 వేలకు పెంచుతామన్నారు. ప్రజలకు సేవ చేసే వలంటీర్లకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
2019 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం నాడు నేడు. 2019 ఎన్నికల వేళ ప్రతిపక్షనేతగా ఉన్న వైయస్ జగన్‌కి, 2024 ఎన్నికల వేళ ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్‌కు మధ్య చాలా తేడా ఉందని.. ఈ నేపథ్యంలో నాడు నేడు తరహాలో రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొంది. అలాంటి పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఓ పక్క సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆ పార్టీ నేడు ఓటమి అంచున నిలబడిందంటే.. అందుకు నెల్లూరు జిల్లాలో నాడు చోటు చేసుకున్న వరుస పరిణామాల కారణంగానే ఆ పార్టీ నేడు ఈ పరిస్థితికి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.
ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకొంది. ఏప్రిల్ 1వ తేదీన వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నాయకుడు రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రభుత్వ కుట్రలు ఇంకా ఆగలేదు. భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణపై ఇప్పటికే రైతులు మండిపడుతున్నారు. తాజాగా ఇప్పటికే పరిహారం చెల్లించిన భూములు, రోడ్లు, మౌలిక సదుపాయాల కొసం కేటాయించిన భూముల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించింది.
CM YS Jagan vs YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నెక్ట్స్ లెవల్లో ఫైర్ అయ్యారు. జగన్ అసలు తన అన్నే కాదని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తాను పులివెందుల పులిబిడ్డనని, ఎవ్వడికి భయపడనని.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఘాటైన వ్యాఖ్యలతో కన్నెర్ర చేశారు.
YS Sharmila: వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధిహామీ పథకం చాలా అద్భుతంగా అమలైందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇప్పుడు ఉపాధిహామీ పథకం ఎవరికి హామీ ఇవ్వడం లేదని, భరోసా కల్పించడం లేదన్నారు. అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న షర్మిల..
ఏపీ సీఎం జగన్ చేపట్టిన అభ్యర్థుల మార్పు ప్రక్రియ వైసీపీకి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది. టికెట్ రాదని తెలిసి కొందరు పార్టీ మారుతున్నారు. మరికొందరేమో ఒక నియోకవర్గంలోని అభ్యర్థులు మరొక నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆసక్తి కనబర్చడం లేదు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. భీమవరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
రెవెన్యూ రాబడి వైసీపీ హయాంలో 16.7 శాతం మేర పెరిగింది.. అదే టీడీపీ హయాంలో 6 శాతం మాత్రమే పెరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి ( Buggana Rajendra Nath Reddy ) అన్నారు.