Home » AP DGP Rajendranath Reddy
అధికార వైసీపీతో అంటకాగిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. కొత్త డీజీపీగా ఎవరొస్తున్నారు..? రేసులో ఎవరెవరున్నారు..? ఎవరికి ఈ పదవి దక్కే ఛాన్స్ ఉంది..? ఇప్పుడిదే ఏపీ రాజకీయాల్లో జరుగుతోన్న పెద్ద చర్చ..!!
ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో.. రాష్ట్ర డీజీపీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డిని(AP DGP Rajendranath Reddy) బదిలీ చేస్తూ జగన్(CM YS Jagan) సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీ పదవి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి(AP CS Jawahar Reddy) ఆదేశించారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఎన్నికల వేళ విధులు సవ్యంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ అవ్వాలని ఆదేశించింది. సోమవారం ఉదయం 11 గంటల లోపు కొత్త డీజీపీని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముగ్గురు డీజీ ర్యాంకు పేర్లను పంపించాలని సూచించింది.
ఏపీ డీజీపీని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని.. ఈ అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయా అధికారులు హామీ ఇచ్చారని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. కానీ నేటికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్న మరికొందరు ఉన్నతాధికారులపై వేటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ పదవుల నుంచి పక్కకు తప్పించడం ఖాయమని