Share News

AP Elections: రాజేంద్రనాథ్‌ ఔట్.. కొత్త డీజీపీ ఎవరు..!?

ABN , Publish Date - May 06 , 2024 | 03:53 AM

అధికార వైసీపీతో అంటకాగిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదిలీ వేటు పడింది. కొత్త డీజీపీగా ఎవరొస్తున్నారు..? రేసులో ఎవరెవరున్నారు..? ఎవరికి ఈ పదవి దక్కే ఛాన్స్ ఉంది..? ఇప్పుడిదే ఏపీ రాజకీయాల్లో జరుగుతోన్న పెద్ద చర్చ..!!

AP Elections: రాజేంద్రనాథ్‌ ఔట్.. కొత్త డీజీపీ ఎవరు..!?

  • వైసీపీతో అంటకాగిన రాజేంద్రనాథ్‌ రెడ్డి బదిలీ

  • కొత్త డీజీపీ తిరుమలరావు?

  • రేసులో అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్‌ కూడా!

  • తక్షణమే కార్యాలయం విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశం

  • ఎన్నికల విధులు అప్పగించరాదని ప్రభుత్వానికి సూచన

  • నేడు 11 గంటల్లోగా ముగ్గురి పేర్లు పంపాలని సీఎ్‌సకు ఆదేశం

  • శాంతి భద్రతల ఏడీజీ శంకబ్రతకు తాత్కాలిక బాధ్యతలు

  • వరుసగా హింసాత్మక ఘటనలు, ప్రతిపక్షాల ఫిర్యాదులు

  • జగన్‌ సేవలో తరించిన ఐపీఎ్‌సలు వరుసగా బదిలీ

  • ఐదుగురు ఎస్పీలు, ఐజీ, బెజవాడ సీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌

  • డీజీపీతోపాటు అనంత, రాయచోటి డీఎస్పీలూ బదిలీ

అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): అధికార పార్టీతో అంటకాగిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదిలీ వేటు పడింది. మరో వారం రోజుల్లో పోలింగ్‌ (AP Elections) జరగనున్న సమయంలో ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం ఈ కీలక చర్య తీసుకుంది. తక్షణమే పోలీసు ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లాలని ఆయన్ను ఆదేశించింది. రాజేంద్రనాథ్‌ రెడ్డికి ఎటువంటి ఎన్నికల విధులూ అప్పగించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఉదయం పదకొండు గంటల్లోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల పేర్లు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ సూచించింది. ఈసీ ఆదేశాల మేరకు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డిని బదిలీ చేస్తూ సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వు లు జారీ చేశారు. తన తర్వాతి ర్యాంక్‌ అధికారికి బాధ్యతలు అప్పగించాలని రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించారు. ఆదేశాలు అందే సమయానికి కార్యాలయంలో లేని రాజేంద్రనాథ్‌ రెడ్డి.. తన బాధ్యతల్ని శాంతి భద్రతల అదనపు డీజీ శంకబ్రత బాగ్చి కి అప్పగిస్తూ సంతకం చేసిన ఫైలును ఇంటి నుంచి పంపినట్లు తెలిసింది. అలాగే వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ మహబూబ్‌ బాషాపైనా ఎన్నికల సంఘం వేటు వేసింది. తక్షణం విధుల నుంచి వైదొలగాలని ఆదేశించింది. డీజీపీ హోదాలో రాజేంద్రనాథ్‌ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ జగన్‌ సేవలో తరించారనే ఆరోపణలు మూటగట్టుకున్నారు. రాష్ట్రంలో కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా జరిగిన పలు హింసాత్మక ఘటన లు ఉదాహరిస్తూ ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో డీజీపీపై ఈసీ చర్యలు తీసుకుంది. సీఎం జగన్‌ సొంత జిల్లా కడపకు చెందిన, ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న రాజేంద్రనాథ్‌ రెడ్డి 2022 ఫిబ్రవరి 17 నుంచి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించారు.

9DGP-Rajendranath-Reddy.jpg


ఐపీఎస్‌లపై వరుసగా వేటు

ఇటీవల పలువురు పోలీస్‌ అధికారులపై ఈసీ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఐదుగురు ఎస్పీలు, గుంటూరు రేంజ్‌ ఐజీ, విజయవాడ సీపీ, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, చివరికి డీజీపీపైనా చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికల వేళ ఇంతమం ది ఐపీఎస్‌ అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసిందంటే.. పోలీసులు ఏ స్థాయిలో అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పోలీసు శాఖలో కీలకమైన డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లను ఇద్దరినీ ఎన్నికల సమయంలో బదిలీ చేయ డం రాష్ట్ర చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన మరుసటి రోజే మార్చి 17న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా పోలీసు లు తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో బందోబస్తు నిర్వహణ, ట్రాపిక్‌ నియంత్రణలో ఏపీ పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. సభికులకు స్వయంగా ప్రధాన మంత్రే జాగ్రత్త లు చెబుతూ.. ‘పోలీసులూ మీరేం చేస్తున్నారు.. విద్యుత్‌ ఫోల్‌ ఎక్కిన వారిని కింది కి దించండి’ అనే పరిస్థితి వచ్చింది. ఎన్నికల కమిషన్‌ దీనిపై నివేదిక తెప్పించుకుంది. అంతకుముందు వచ్చిన ఫిర్యాదుల్ని కూడా పరిశీలించి చర్యలకు ఉపక్రమించింది. గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజుతో పాటు పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌ రెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పలు ఫిర్యాదులు రావడంతో అనంతపురం ఎస్పీ అన్బురాజన్‌, చిత్తూరు ఎస్పీ జాషువాను ఈసీ బదిలీ చేసింది. ఆ తర్వాత సీఎం జగన్‌ బస్సు యాత్రలో భాగంగా విజయవాడకు వచ్చినప్పుడు తగిన బందోబస్తు జాగ్రత్తలు తీసుకోలేదని పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణాపై ఆరోపణలు వచ్చాయి. దీంతో విజయవాడ సీపీ కాంతి రాణాను తప్పించిన ఈసీ.. పీహెచ్‌డీ రామక్రిష్ణను ఎంపిక చేసింది. ఇక నిఘా విభాగం అధిపతిగా పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు జగన్‌ రెడ్డి సేవలో తరించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యమంత్రి నివాసం తాడేపల్లి ప్యాలె్‌సలో తనకు ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేసుకు ని జగన్‌ రెడ్డితోనే ‘అంజన్నా’ అని పిలిపించుకునే స్థాయిలో సేవలందించారు. ప్రతిపక్షాల ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల కమిషన్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పీఎ్‌సఆర్‌ ఆంజనేయులును తప్పించి, కుమార్‌ విశ్వజీత్‌ను ఎంపిక చేసింది.

వైసీపీ మూకల వీరంగం

పలువురు సీనియర్‌ ఐపీఎ్‌సలపై ఈసీ చర్యలు తీసుకున్న తర్వాత కూడా కొంద రు పోలీసు అధికారుల్లో మార్పు రాలేదు. డీజీపీ భరోసాతోనే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, రాజేంద్రనాథ్‌ రెడ్డిని మారిస్తే తప్ప మార్పు రాదని ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేశాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్షనేతలపై వైసీపీ మూకల దాడులు ఎక్కువయ్యాయి. సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఆదివా రం నాడు పర్యటించిన ధర్మవరంలో బీజేపీ కార్యకర్తను వైసీపీ గూండాలు చితకబాదారు. రక్తం కారుతున్నా వదిలి పెట్టలేదు. సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సొంత గ్రామంలో ప్రచారానికి వెళ్లిన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యా దవ్‌ కాన్వాయ్‌పై వైసీపీ శ్రేణులు దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారు. బందరులో జనసేన కార్యకర్త ఇంటిపైకి వైసీపీ మూకలు వెళ్లి ఆయన్ను బయటికి లాక్కొచ్చి చంపేందుకు ప్రయత్నించారు. అనకాపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌పై పోలీసుల సమక్షంలోనే దాడికి తెగబడ్డారు. వీటన్నిటిపై సమీక్షించి చర్యలు తీసుకోవాల్సిన డీజీపీ బాధ్యతలు వదిలేసి సీఎం జగన్‌తో నిరంతరం ఫోన్లో మాట్లాడుతూ ఆయన ఆదేశాలు పాటిస్తున్నారనే సమాచారం ఎన్నికల కమిషన్‌కు అందింది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఆదివారం సీఎంను కలిసేందుకు తాడేపల్లి ప్యాలె్‌సకు వెళ్లి వచ్చినట్లు కూడా సమాచారం అందడంతో ఆయనపై బదిలీ వేటు పడిందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.


AP-New-DGP-Tirumala-Rao.jpg

కొత్త డీజీపీ తిరుమలరావు?

కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావును ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఐపీఎస్‌ అధికారుల్లో తిరుమలరావు అందరి కన్నా సీనియర్‌. 1989లో ఐపీఎ్‌సకు ఎంపికయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల్లో పనిచేశారు. కేంద్ర సర్వీసుల్లో సీబీఐలో పనిచేశా రు. రాయలసీమ, తెలంగాణలో డీఐజీగా, సైబరాబాద్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా, కోస్తాంద్ర ఐజీగా, సీఐడీ ఏడీజీగా పని చేశారు. ఎలాంటి వివాదాల్లేని తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపేందుకు ఎంపిక చేసిన ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల పేర్లలో తిరుమలరావు, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్‌ ఉన్నట్లు తెలిసింది. రోడ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా పనిచేస్తున్న అంజనా సిన్హా రాష్ట్రంలో శాంతి భద్రతల విభాగంలో పనిచేయలేదు. మాదిరెడ్డి ప్రతాప్‌ కూడా అంతే. దీంతో అన్ని విధాలా తిరుమలరావే అర్హుడనే వ్యాఖ్యలు పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఇద్దరు డీఎస్పీలపై వేటు

అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అనంతపురం, రాయచోటి డీఎస్పీలను ఈసీ బదిలీ చేసింది. తక్షణం విధుల నుంచి వైదొలగి, హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి వైసీపీ వీరవిధేయుడిగా గుర్తింపు పొందారు. అనంతపురం రూరల్‌ మండలం రామక్రిష్ణ కాలనీలో వైసీపీ ఎంపీటీసీ భర్త నగే్‌షపై జరిగిన దాడి ఘటనలో సంబంధం లేనివారిని కేసులో ఇరికించారని డీఎస్పీపై ఆరోపణలు వచ్చాయి. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జయరాంనాయుడు, ఆయన భార్య హరిత తదితరులను కేసులో చేర్చారు. ఈ విషయంపై టీడీపీ, సీపీఐ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సూచనలు, ఆదేశాల మేరకే డీఎస్పీ వీరరాఘవరెడ్డి ఇలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణం స్పందించిన ఎన్నికల కమిషన్‌.. డీఎస్పీపై వేటు వేసింది. అలాగే రాయచోటి డీఎస్పీ మహబూబ్‌ బాషానూ ఈసీ బదిలీ చేసింది. అధికారపార్టీకి చెందిన నిందితులను కాపాడబోయి ఆయన ఈసీ ఆగ్రహానికి గురయ్యారు. ఇటీవ ల పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం విఠల గ్రామం వద్ద టీడీపీ ప్రచార రథాన్ని ఇద్దరు వ్యక్తులు పెట్రోలు పోసి కాల్చారు. ఈ కేసులో నిందితుల ఆచూకీని గుర్తించినా ఇంతవరకు అరెస్ట్‌ చేయలేదు. రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేయడంతో.. ఆయనపై బదిలీ వేటు వేసినట్లు తెలిసింది.

Updated Date - May 06 , 2024 | 08:03 AM