AP Assembly Elections 2024: డీజీపీని ఎన్నికల విధులకు దూరం పెట్టండి
ABN , Publish Date - Apr 25 , 2024 | 07:05 PM
ఏపీ డీజీపీని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని.. ఈ అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయా అధికారులు హామీ ఇచ్చారని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. కానీ నేటికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి, ఏప్రిల్ 25: ఏపీ డీజీపీని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని.. ఈ అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయా అధికారులు హామీ ఇచ్చారని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. కానీ నేటికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Lok Sabha polls 2024: అసదుద్దీన్ ఓవైసీ ప్రత్యర్థి ఆస్తులు ఇవే
ఈ సారైనా విచారణ జరిపి డీజీపీని ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని కోరుతున్నామన్నారు. గురువారం అమరావతిలో ఎన్నికల సంఘం సీఈవో ఎంకే మీనాని భాను ప్రకాశ్ రెడ్డి కలిసి.. ఈ ఎన్నికల్లో నిష్ఫక్షపాతంగా అధికారులు విధులు నిర్వహించేలా చూడాలంటూ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... కొందరు అధికారులు.. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్దంగా పని చేస్తున్నారని ఆరోపించారు.
Odisha: ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు: మరోవైపు ఎదురు కాల్పులు
పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా అధికారులు నిబంధనల మేరకు పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్ లైన్స్‌ను కిందిస్థాయి అదికారులు అమలు చేయడం లేదన్నారు. ఏపీలో కొన్ని లక్షల మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుంటున్నారని గుర్తు చేశారు.
Manish Kashyap: కాషాయం కుండువా కప్పుకున్న కశ్యప్
ఉద్దేశపూర్వకంగా అధికారులు వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులంతా నియమ, నిబంధనలకు లోబడి పని చేయాల్సి ఉందని చెప్పారు. ఇక ఇప్పటికే కొంతమంది అధికారుపై బదిలీ వేటు పడిందిని తెలిపారు. అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తే.. భవిష్యత్‌లో తప్పకుండా చర్యలు తీసుకుంటామని భాను ప్రకాశ్ ఈ సందర్బంగా ప్రభుత్వ ఉద్యోగులను హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా నిబంధనల ప్రకారమే సిబ్బంది నడుచుకోవాలన్నారు.
Read National News and Telugu News