Home » AP Election Results Live Updates
ఏపీలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ అభ్యర్థులు పైచేయి సాధించినట్లు తెలుస్తోంది. రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, నెల్లూరు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు.
ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓవైపు పోస్టల్ బ్యాలెట్లతో పాటు మరోవైపు ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు ముందు వైసీపీ నేతలు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.
ఏపీ ఓటర్ల తీర్పు వన్‌సైడ్‌గా ఉన్నట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు అధిక్యం కనబర్చగా.. ఈవీఎంల కౌంటింగ్ తర్వాత కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు మొదటి రౌండ్లో అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Election Results) గెలిచేదెవరు..? ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారు..? ఎవర్ని సీఎం పీఠంపై కూర్చోబెట్టబోతున్నారు..? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అక్షరాలా నిజమవుతాయా..? లేకుంటే అట్టర్ ప్లాప్ అవుతాయా..? 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీచేసిన 2,383 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని.. 3.33 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా తీర్పు ఇచ్చారు..? ఇలా ఎన్నో ప్రశ్నలకు..