AP Election Results 2024: ఒకే ఒక్క క్లిక్‌తో ఏపీ ఎన్నికల ఫలితాలు.. ఎక్స్ క్లూజివ్‌గా తెలుసుకోండి..
ABN , Publish Date - Jun 03 , 2024 | 09:02 PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Election Results) గెలిచేదెవరు..? ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారు..? ఎవర్ని సీఎం పీఠంపై కూర్చోబెట్టబోతున్నారు..? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అక్షరాలా నిజమవుతాయా..? లేకుంటే అట్టర్ ప్లాప్ అవుతాయా..? 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీచేసిన 2,383 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని.. 3.33 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా తీర్పు ఇచ్చారు..? ఇలా ఎన్నో ప్రశ్నలకు..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Election Results) గెలిచేదెవరు..? ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారు..? ఎవర్ని సీఎం పీఠంపై కూర్చోబెట్టబోతున్నారు..? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అక్షరాలా నిజమవుతాయా..? లేకుంటే అట్టర్ ప్లాప్ అవుతాయా..? 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీచేసిన 2,383 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని.. 3.33 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా తీర్పు ఇచ్చారు..? ఇలా ఎన్నో ప్రశ్నలకు మంగళవారం నాడు వచ్చేస్తున్న ఎగ్జాక్ట్ ఫలితాలతో సమాధానం దొరకబోతోంది. మరికొన్ని గంటల్లోనే పోటీచేసిన అభ్యర్థులు, ఓటేసిన ఓటర్ల నరాలు తెగే ఉత్కంఠకు తెరపడనుంది. మూడు వారాలుగా నెలకొన్న నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడే సమయం ఆసన్నమైంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఆ తర్వాత అసలు సిసలైన ఈవీఎంలోని ఓట్ల కౌంటింగ్ షురూ కాబోతోంది. ఇక లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉండగా.. ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని ఈసీ నియమించిన 119 అబ్జర్వర్లు పరిశీలించబోతున్నారు.
మినిట్ టూ మినిట్!
ఏ నియోకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు..? ఏ రౌండ్‌లో ఏ పార్టీ అభ్యర్థి ఎన్ని ఓట్లతో ముందంజ, వెనుకంజలో ఉన్నారు..? ఫైనల్‌గా ఏ పార్టీ అభ్యర్థి గెలిచారు..? ఏ కౌంటింగ్ కేంద్రంలో పరిస్థితి ఎలా ఉంది..? గొడవలు జరుగుతున్నాయా..? లేకుంటే ప్రశాంతంగానే కౌంటింగ్ నడుస్తోందా..? ఇలా తొలి అభ్యర్థి గెలుపు మొదలుకుని చివరాకరి వరకూ ఏ పార్టీ గెలిచింది..? ఏపీని ఏలేదెవరు..? అని ఫుల్ క్లారిటీ వచ్చేంతవరకూ ఎక్కడేం జరిగినా నిమిషాల్లోనే ‘మినిట్ టూ మినిట్ లైవ్ అప్డేట్స్’ అందించడానికి www.andhrajyothy.com మీ ముందుకు వచ్చేస్తోంది. ఏపీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రతి అప్డేట్‌ను సింగిల్ క్లిక్‌తో తెలుసుకోవచ్చు.
సిద్ధమేనా..?
ఒక్క ఫలితాలు అప్డేట్స్ మాత్రమే కాదు.. ఎప్పటికప్పుడు స్పెషల్ స్టోరీలు, విశ్లేషణలు శరవేగంగా అందరికీ అర్థమయ్యేలా సులువుగా ఆంధ్రజ్యోతి టీమ్ అందించబోతోంది. తెల్లారుజామున 05:00 గంటల నుంచే ఏపీలో.. దేశ వ్యాప్తంగా పరిస్థితి ఎక్కడ ఎలా ఉందనేది మొదలుకుని మంగళవారం రాత్రి 12 గంటల వరకూ నాన్ స్టాప్‌గా లైవ్ అప్డేట్స్ ఇస్తూ తెలుగు మీడియా ఇండస్ట్రీలోనే సరికొత్త ప్రయోగం చేయబోతోంది. ఇంకెందుకు ఆలస్యం.. 8 గంటలకే మీరు సిద్ధంగా ఉంటే.. అప్డేట్స్, ప్రత్యేక కథనాలు ఇవ్వడానికి మేం రె‘ఢీ’గా ఉంటాం.. లెట్స్ గో.. 1,2,3!!