Home » AP High Court
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షకు(APPSC Group 1 Exam) సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పరీక్షలపై విచారణ ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు(AP High Court). అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి(Single Judge) ఇచ్చిన తీర్పులో కొన్ని భాగాలపై గతంలో స్టే విధించింది డివిజనల్ బెంచ్.
Andhrapradesh: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అన్ని శాఖల అధికారాలు ఇవ్వడంపై హైకోర్ట్‌లో శుక్రవారం విచారణ జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వేసిన పిటిషన్‌పై ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. విజిలెన్స్ ఐజీ రఘురామిరెడ్డి పంపిన ప్రతిపాదనలపై స్టే ఇవ్వాలని లోకేష్ కోరారు. టీడీపీ నేతలను ఇబ్బందులు పెట్టేందుకే ఈ ప్రతిపాదన అని పేర్కొన్నారు.
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్(Sarath) కేసులో ఏపీ హైకోర్టు, విజయవాడ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నాడు శరత్ కేసును రెండు కోర్టులు విచారణ చేపట్టాయి. ఈ కేసులో కీలక పరిణామాలపై పిటీషనర్లు వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం ఏపీ హైకోర్టు, విజయవాడ కోర్టు శరత్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఎన్నికల ముందు మాజీ మంత్రి నారాయణ(Narayana)కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. నారాయణ కేసును గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో సీఆర్పీసీలోని సెక్షన్ 41ఏ నిబంధనలను పాటించాలని హైకోర్టు ఆదేశించింది. పొంగూరి కృష్ణప్రియ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నారాయణపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఏపీలోని ఇసుక సరఫరా, ధరలపై రాష్ట్ర హైకోర్టు మండిపడింది. ఏపీలో ఇసుక ధర బంగారంతో పోటీ పడుతోందని వ్యాఖ్యానించింది. ఇసుక తవ్వకం, తరలింపుపై అధికారులు నియంత్రణ కోల్పోయారని అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
తిరుమల(Tirumala) అలిపిరి నడక దారిలో వన్యమృగాల సంచారం పెరగడం.. మనుషులపై దాడులు పెరుగుతుండటంతో నడకదారి భక్తుల భద్రతా చర్యలపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
Andhrapradesh: ఎన్నికలకు వాలంటీర్లు ను వినియోగించడంపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని పేర్కొంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు (బుధవారం) ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు విచారణ రాగా.. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
Andhrapradesh: డీఎస్సీ 2024 షెడ్యూల్ విషయంలో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. హైకోర్టు ఆదేశానుసారం డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం నాడు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. మార్చి 25 నుంచి హాల్ టికెట్లు జారీ అవుతాయని.. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Andhrapradesh: మాజీ మంత్రి నారాయణ అల్లుడికి హైకోర్టులో ఊరట లభించింది. ఇన్స్పైర్ మేనేజిమెంట్ సర్వీసెస్ పేరుతో మాజీ మంత్రి నారాయణ అల్లుడు కే.పునీత్ 92 బస్సులు కొనుగోలు చేసి వాటికి సంబంధించిన జీఎస్టీ కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారని పేర్కొంటూ నెల్లూరు, బాలాజీ నగర్ పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ కేసును క్వాష్ చేయాలని కోరుతూ పునీత్ హైకోర్ట్‌ను ఆశ్రయించారు.
GST కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఏపీ హైకోర్టును మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబ సభ్యులు ఆశ్రయించారు.ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పుల్లారావు సతీమణి వెంకాయమ్మ, కుమార్తె స్వాతి, ఇతరులు పిటీషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.