Big Breaking: గ్రూప్ 1 పరీక్షలపై విచారణ వాయిదా..
ABN , Publish Date - Mar 27 , 2024 | 11:56 AM
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షకు(APPSC Group 1 Exam) సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. పరీక్షలపై విచారణ ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు(AP High Court). అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి(Single Judge) ఇచ్చిన తీర్పులో కొన్ని భాగాలపై గతంలో స్టే విధించింది డివిజనల్ బెంచ్.
అమరావతి, మార్చి 27: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షకు(APPSC Group 1 Exam) సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. పరీక్షలపై విచారణ ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు(AP High Court). అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి(Single Judge) ఇచ్చిన తీర్పులో కొన్ని భాగాలపై గతంలో స్టే విధించింది డివిజనల్ బెంచ్. ఆ సందర్భంగా విచారణను మార్చి 27వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. ఇవాళ కోర్టులో విచారణ జరుగగా.. విచారణ మరోసారి వాయిదా పడింది.
2018లో 167 పోస్టులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఈ ఉద్యోగాల ఎంపిక అవకతవకలు జరిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిగిన సింగిల్ బెంచ్ ధర్మాసనం.. మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. అంతేకాదు.. ఏపీపీఎస్సీ ప్రకటించిన ఉద్యోగుల జాబితాను తిరస్కరించింది.
Also Read: జగన్ రెడ్డి బస్సు యాత్రపై వైసీపీ నేతల్లో ఆందోళన..
సింగిల్ బెంచ్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం వివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. తీర్పుపై స్టే విధించాలని కోరింది. పేపర్ల మూల్యాంకనానికి సంబంధించిన ఆధారాలను డివిజన్ బెంచ్‌కు సమర్పించింది ఏపీపీఎస్సీ. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. ఇరు పక్షాల వాదనలు విని.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. తదుపరి విచారణ మార్చి 27వ తేదీకి వాయిదా వేయగా.. ఇవాళ మరోసారి విచారించిన ధర్మాసనం.. విచారణను మరోసారి వాయిదా వేసింది. అంతకు ముందు విధించిన స్టే అలాగే కొనసాగుందని ధర్మాసనం స్పష్టం చేసింది.