AP HighCourt: మాజీ మంత్రి నారాయణ అల్లుడికి హైకోర్ట్‌లో రిలీఫ్
ABN , Publish Date - Mar 12 , 2024 | 02:29 PM
Andhrapradesh: మాజీ మంత్రి నారాయణ అల్లుడికి హైకోర్టులో ఊరట లభించింది. ఇన్‌స్పైర్ మేనేజిమెంట్ సర్వీసెస్ పేరుతో మాజీ మంత్రి నారాయణ అల్లుడు కే.పునీత్ 92 బస్సులు కొనుగోలు చేసి వాటికి సంబంధించిన జీఎస్‌టీ కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారని పేర్కొంటూ నెల్లూరు, బాలాజీ నగర్ పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ కేసును క్వాష్ చేయాలని కోరుతూ పునీత్ హైకోర్ట్‌ను ఆశ్రయించారు.
అమరావతి, మార్చి 12: మాజీ మంత్రి నారాయణ (Former Minister Narayana) అల్లుడికి హైకోర్టులో (AP HighCourt) ఊరట లభించింది. ఇన్‌స్పైర్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ పేరుతో మాజీ మంత్రి నారాయణ అల్లుడు కే.పునీత్ 92 బస్సులు కొనుగోలు చేసి వాటికి సంబంధించిన జీఎస్‌టీ (GST) కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారని పేర్కొంటూ నెల్లూరు, బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును క్వాష్ చేయాలని కోరుతూ పునీత్ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) విచారణకు రాగా... పిటిషినర్ విషయంలో అరెస్ట్ చేయడంతో పాటు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ.. హైకోర్టు 6 వారాల పాటు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తు కొనసాగించవచ్చని పోలీసులకు స్పష్టీకరించింది. కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
KTR: కరీంనగర్ ‘కదన భేరి’ సభకు కేటీఆర్ దూరం.. కారణమిదే!
Rishabh Pant: రిషబ్ పంత్‌కు సంబంధించి బీసీసీఐ కీలక ప్రకటన
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...